సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్, హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ విడుదల చేస్తుండగా, సీడెడ్ లో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

