HomeEntertainment25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న జీ5 ఒరిజినల్ సిరీస్ ‘పంచనామా’

25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న జీ5 ఒరిజినల్ సిరీస్ ‘పంచనామా’

- Advertisment -

జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు.

వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘పంచనామా’ సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా మారింది. ఈ మొదటి సీజన్ క్లైమాక్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎండింగ్ చూస్తే ఇది అంతం కాదు.. ఆరంభం అన్నట్టుగా ఉంటుంది. ఇక వెంటనే రెండో సీజన్ చూసేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగించేలా ఈ మొదటి సీజన్‌ను తెరకెక్కించారు.

‘Panchanama’ on ZEE5 App. Click here to watch it. https://zee5.onelink.me/RlQq/zzk4yax6

పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పంచనామా’ కచ్చితంగా నచ్చుతుంది. అందుకే జీ5లో కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా భరత్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త యాంగిల్‌లో భరత్ తన పాత్రను పోషించారు. మోహన్ శ్రీవత్స మేకింగ్, నరేష్ కుమరన్ ఆర్ఆర్, సందీప్ కాంత్ కెమెరావర్క్ ఇవన్నీ కూడా సిరీస్‌ను నిలబెట్టాయి. ఈ సిరీస్‌లో మేధా రెడ్డి, శివాజీ రాజా, చరణ్ బాబు, రూపా లక్ష్మీ, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ పోషించిన పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments