HomeEntertainmentముక్కోణపు పోటీ

ముక్కోణపు పోటీ

- Advertisment -

ఒక గొప్ప సందడితో మొదలైన 2026… అంతే గొప్ప సందడితో వీడ్కోలు తీసుకోనుంది. నందమూరి బాలకృష్ణ “దాదా”, అక్కినేని నాగార్జున “కింగ్ 100” రెండు చిత్రాలు డిసెంబర్ 24న రానున్నాయి. టైటిల్ని బట్టి “కింగ్ 100” చిత్రం నాగార్జునకు ఎంత కీలకమో తెలుస్తూనే ఉంది. “లెనిన్”తో తన కుమారుడు అఖిల్ కి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నాగార్జున… “కింగ్ 100” చిత్రాన్ని కూడా తనే నిర్మిస్తూ తనకు తాను ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చుకొని “కింగ్” అనే టైటిల్ ని సార్ధకం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక తన విజయ యాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చిన “అఖండ-2” తర్వాత బాలయ్య “దాదా” సినిమాతో మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. వీరసింహారెడ్డి అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో “దాదా”పై ఇప్పటికే అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాల మధ్యలో రాబోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ “కింగ్”. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి వారంతా తమ ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతుంటే… షారుక్ ఖాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ తన స్టార్ డం కాపాడుకుంటూ వస్తున్నాడు. “పఠాన్, జవాన్, దున్కి” చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన షారుక్ ఖాన్ తాజా చిత్రం “కింగ్” తెలుగులో మరీ అంత ప్రభావం చూపించే అవకాశం లేకపోయినప్పటికీ… సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముక్కోణపు పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారనేది వేచి చూడాల్సిందే!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments