కాకా వెనక్కి
విశ్వంభర ముందుకి
సంక్రాంతి కానుకగా “కాకా” వస్తుందని అధికారికంగా ప్రకటించిన కొద్ది రోజులకే ఆ తేదీకి రాకపోవచ్చునే ఊహాగానాలు వెలువడ్డాయి. చిత్ర బృందం ముందుకొచ్చి… “ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి వస్తున్నాం” అనే ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. అయినా సరే ఆ ఊహగానాలు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు “కాకా” వెనక్కి వెళుతుందని కాకుండా, “విశ్వంబర” ముందుకు వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం “టాక్సిక్” కావచ్చనే అంచనాలు జత కలుస్తున్నాయి. “టాక్సిక్” చిత్రాన్ని నిర్మించిన సంస్థే “కాకా” చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడం తెలిసిందే. మరోవైపు “విశ్వంభర” దర్శకుడు నందమూరి మోక్షజ్ఞతో అరంగేట్రం చేయించే బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైతే దర్శకుడు వశిష్ట ఫ్రీ అవడానికి కనీసం సంవత్సరం పడుతుంది. ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా… “కాకా” వెనక్కి వెళ్లి, “విశ్వంభర” ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇదే సందర్భంలో… మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే, “విశ్వంభర”, “కాకా”… రెండు చిత్రాలూ వారం పది రోజుల వ్యవధిలో విడుదలయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమనే అంచనాలు వేస్తున్న వారూ లేకపోలేదు!!

