మిలియన్-డాలర్ స్టూడియోస్, నియో క్యాసిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ‘అన్బే డయానా’ చిత్రంతో రోజా సెల్వమణి మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె పరితల్లి సరళ పాత్రలో కనిపించారు. పరి ఎలవళగన్ కథ రాసి, దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు. రమ్య రంగనాథన్ కథానాయికగా నటించారు. ఈ సందర్భంగా .. రోజా సెల్వమణి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలోని ప్రేమ,ఆత్మీయత, కామెడీ, కుటుంబం, బంధాలు, భిన్నమైన సంస్కృతులను కలిపి చూపించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. సరళ పాత్రకు తనదైన వ్యక్తిత్వం, భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాత్రకు జీవం పోయడాన్ని నేను ఆస్వాదించాను. ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుండటం చాలా ఆనందంగా ఉంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు’’ అని అన్నారు!!

