HomeEntertainmentప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన కుకింగ్ సెలబ్రేషన్‌ ఇప్పుడు తమిళ ఇళ్లలోకి.. సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా...

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన కుకింగ్ సెలబ్రేషన్‌ ఇప్పుడు తమిళ ఇళ్లలోకి.. సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్ర‌భు

- Advertisment -
  • ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన కుకింగ్ ఫార్మాట్‌కు తమిళ నేటివిటీతో సరికొత్త రూపం.. సోనీ విళా, సోనీ లివ్‌లో ఆహారం, రుచులు, భావోద్వేగాలు, అనుబంధాలను సెలబ్రేట్ చేయడానికి తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఒక్కచోటికి తీసుకొస్తున్న సమంత రూత్ ప్రభు

Promo link: https://www.instagram.com/reel/DcDmz_VJGad

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కుకింగ్ ఫార్మాట్‌ను తమిళ ప్రేక్షకుల కోసం సోనీ విజా, సోనీ లివ్‌లో స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్రభు హోస్ట్ చేస్తుండ‌టం విశేషం.

సెలబ్రిటీలు, ఫుడ్, కాంపిటీషన్‌.. ఈ మూడు ప్రపంచాలను ఒకే ద‌గ్గ‌ర‌కి తీసుకొస్తూ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ రూపొందుతోంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తొలిసారి సెట్స్ నుంచి కిచెన్‌లోకి అడుగుపెట్టి.. కఠినమైన వంటలకు సంబంధించిన‌ సవాళ్లు, ఊహించని ట్విస్టులు, ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. ప్రతి ఛాలెంజ్‌లో విజయం సాధించేలా రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ తమ టాలెంట్‌ను నిరూపించుకోబోతున్నారు.

బనిజె ఏషియా నిర్మిస్తోన్న‌ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాస్టర్‌చెఫ్ ఫార్మాట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. అయితే తమిళ నేటివిటీకి తగ్గట్టుగా లోకల్ ఫ్లేవర్స్‌, ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రిటీలు, తమిళ సెలబ్రిటీ కల్చర్‌లోని ప్రత్యేకమైన కెమిస్ట్రీకి ప్రాధాన్యతనిస్తూ ఈ షోను రూపొందిస్తున్నారు.

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ సోనీ విళాలో కీలకమైన ఎంటర్‌టైన్‌మెంట్ షోగా నిలవనుంది. అలాగే ఈ షో సోనీ లివ్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులోకి రానుంది. మెయిన్ ఎపిసోడ్స్‌కు మించి ప్రేక్షకులను మరింత ఎంగేజ్ చేసేలా ప్రత్యేకమైన షార్ట్ ఫార్మ్ కంటెంట్‌ను కూడా అందించనున్నారు. సెలబ్రిటీల కుకింగ్ జర్నీ, వారు ఎదుర్కొనే ఛాలెంజెస్, కిచెన్‌లో చోటుచేసుకునే ఆసక్తికరమైన, మరిచిపోలేని మూమెంట్స్‌ను ఈ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా ప్రేక్షకులకు చూపించనున్నారు.

ఈ సంద‌ర్భంగా సమంత మాట్లాడుతూ.. “ఈ షోలో పాల్గొంటుండ‌టం ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉంది. నేను ఇప్పటివరకు చేసిన వాటన్నింటికంటే ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఈ షోకు నేను నో చెప్పలేకపోవడానికి ప్రధాన కారణం. అంద‌రినీ ఒకేచోటికి తీసుకురావడంలో, మధురమైన జ్ఞాపకాలను సృష్టించడంలో, సాధారణంగా కెమెరాల ముందు కనిపించని మనలోని మరో కోణాన్ని బయటపెట్టడంలో ఫుడ్‌కు ఓ ప్రత్యేకమైన శక్తి ఉంది. ముఖ్యంగా మనకు ఎంతో ఇష్టమైన తమిళ సెలబ్రిటీలు కిచెన్‌లోకి అడుగుపెట్టి, రిస్క్‌లు తీసుకోవడం, తప్పులు చేయడం, తమను తామే సర్‌ప్రైజ్ చేసుకోవడం, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్యాషన్‌తో పోటీప‌డ‌టాన్ని చూడ‌టానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎవరు కిచెన్‌లో వంట చేయబోతున్నారో ఇప్పుడే చెప్పాలని నాకూ ఉంది.. కానీ అలా చెబితే అసలు ఫన్ ఏముంటుంది? సోనీ విళాతో కలిసి మేం ఏం వండబోతున్నామో అందరూ చూసి ఎంజాయ్ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.

సమంత రూత్ ప్రభు హోస్ట్‌గా వ్యవహరిస్తూ..తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కిచెన్‌లోకి అడుగుపెట్టనున్న ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’.. సెలబ్రిటీ కుకింగ్‌కు సరికొత్త వినోదాన్ని తీసుకురానుంది. ఫుడ్, ఫేమ్, కాంపిటీషన్‌తో పాటు తమిళ సంస్కృతిలోని ఆప్యాయతను ఒకే వేదికపైకి తీసుకొస్తూ.. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది.

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ త్వరలోనే సోనీ విళా, సోనీ లివ్‌లోకి రానుంది. డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ షోకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందుబాటులోకి రానుంది

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments