యువసామ్రాట్ నాగచైతన్య, కార్తీక్ వర్మ దండు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మిథికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా, జయరామ్, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం షూటింగ్‌తో పాటు భారీ స్థాయిలో VFX పనులు జరుగుతున్నాయి. VFX పనులు అనుకున్న స్థాయిలో పూర్తయితే దసరా కానుకగా సినిమాను విడుదల చేయడానికి 90 శాతం అవకాశం ఉందని దర్శకుడు కార్తీక్ దండు వెల్లడించారు. ఒకవేళ పనులు ఆలస్యమైతే డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు!!

