ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారతదేశంలోని ఏడు రాష్ట్రాల నుండి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ AAFAకు చెందిన దాదాపు 1,000 మంది సభ్యులతో ఆరు గంటలకు పైగా సమయాన్ని గడిపారు. వచ్చిన ప్రతీ అభిమానితో అల్లు అర్జున్ ఆప్యాయంగా మాట్లాడారు. అందరికీ విలువైన సలహాల్ని అందించారు. ప్రతీ ఒక్క సభ్యునికి అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఫోటోలను ఇచ్చారు. కలిసి నృత్యం చేశారు. ఒకరినొకరు అభిప్రాయాల్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వెయ్యి మంది AAFA సభ్యులందరికీ బీమా కవరేజీని అందించారు!!

