HomeEntertainmentధీరజ అప్పాజీ తాజా జీరో బడ్జెట్ లఘు చిత్రం"రీ-వాల్యుయేషన్"(Second Chance at Love)

ధీరజ అప్పాజీ తాజా జీరో బడ్జెట్ లఘు చిత్రం”రీ-వాల్యుయేషన్”(Second Chance at Love)

- Advertisment -

“అమ్ములు, ది గిల్ట్, యాని-‘మేల్’, డియర్ ఫ్యూచర్ మి” వంటి బ్యాక్ టు బ్యాక్ షార్ట్ ఫిలిమ్స్ తో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తాజాగా తెరకెక్కించిన లఘు చిత్రం “రీ-వాల్యుయేషన్” (Re-Valuation). “సెకండ్ ఛాన్స్ ఎట్ లవ్” అనే ట్యాగ్ లైన్ తో జీరో బడ్జెట్ లో తెరకెక్కించిన, 12 నిమిషాల లోపు నిడివి కలిగిన ఈ లఘు చిత్రంలో సురేష్ జగన్నాధం – అనుశ్రీ జంటగా నటించారు. తను రూపొందించే ప్రతి చిత్రంలోనూ కచ్చితంగా నటించే ధీరజ అప్పాజీ… ‘రీ-వాల్యుయేషన్”లో టైటిల్ జస్టిఫై చేసే అతిథి పాత్ర పోషించారు!!

తెరపై కనిపించకుండా… ఫోన్ లో వినిపించే పాత్రలకు లక్ష్మీ పెండ్యాల, స్వాతి బొలిశెట్టి, వెంకట్ విహారి డబ్బింగ్ చెప్పారు. కర్రి వీర గణేష్, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా సమర్పించిన ఈ లఘు చిత్రానికి Wild Wolf యూట్యూబ్ ఛానల్, “గోల్డెన్ స్పూన్ కేఫ్” లొకేషన్ పార్టనర్స్. పెళ్ళిచూపుల్లో అందరికీ నచ్చిన అబ్బాయిని… అమ్మాయి ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆ అమ్మాయిని మళ్లీ కలుసుకోవడం కోసం అబ్బాయి చేసిన ప్రయత్నం సఫలీకృతం అయ్యిందా? అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి… కెమెరా – ఎడిటింగ్ – మ్యూజిక్; వెంకట్ విహారి, సమర్పణ; కర్రి వీర గణేష్ – కొమ్మిడి శ్రీనివాసరెడ్డి, రచనా సహకారం: మాధవి ఏలూరి, కథ – మాటలు – నిర్మాణం – దర్శకత్వం; ధీరజ అప్పాజీ!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments