HomeEntertainmentఅన్ని సత్కారాలు ఒకెత్తు ఈ సత్కారం ఒక్కటీ ఒకెత్తు

అన్ని సత్కారాలు ఒకెత్తు ఈ సత్కారం ఒక్కటీ ఒకెత్తు

- Advertisment -

తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ మీట్ ది ప్రెస్ లో పద్మశ్రీ రాజేంద్రప్రసాద్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో కేవలం కామెడీ హీరోగానే కాకుండా, ఎన్నో సందేశాత్మక, భావోద్వేగ ప్రధానమైన చిత్రాల్లో నటించి మెప్పించారు.

వెండితెరపై ఆయన పండించే నవ్వులు, చూపించే హావభావాలు తరాల తరబడి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా ఆయనను ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ చిరు సత్కారం చేసి, మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బేల్ ట్రీ హోటల్స్‌ యజమాని మరియు నటుడు రాజారెడ్డి, పాటు శ్రీనివాస్‌రెడ్డి స్పాన్సర్స్ గా సహకరించారు. ఫిలిం క్రిటిక్స్ గౌరవ అధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి సురేష్‌కొండేటిగ బొకేను అందజేసి మొమెంటోను రాజేంద్రప్రసాద్ కి అందించారు. తాను ఇప్పటివరకు అందుకున్న అన్ని పురస్కారాల కంటే ఫిల్మ్ క్రిటిక్స్ చేసిన సత్కారం చాలా ప్రత్యేకమైనదని ఈసందర్భంగా రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments