గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని #NBK111 చిత్రం కోసం మళ్ళీ జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, హై-వోల్టేజ్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా. ఈ కాంబినేషన్ నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ట్రేడ్‌మార్క్ మాస్ మూమెంట్స్ తో సినిమా అద్భుతంగా అలరించబోతోంది. బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ పేరుతో ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు!!

