Thursday, February 5, 2026
HomeEntertainmentAI ❌సినిమా

AI ❌సినిమా

- Advertisment -

AI సినిమా

AI → ఒక పరికరం లాంటిది మాత్రమే
సినిమా → నిండైన కళా నైపుణ్యం కలిగినది

ఎంతటి అద్భుతాలను సృష్టించినా కూడా AI సినిమా క్రియేటివిటీని, ఆలోచన విధానాన్ని అధిగమించలేదు.

ఔట్ డేటెడ్ కథలు, అనవసరపు టెక్నాలజీ తో రూపొందిన సినిమాలే విజయాలకు దూరం అవుతాయి.. కథ బలం లేకుండా టెక్నాలజీ తోనే తీసిన ఎన్నో సినిమాలు బొక్క బోర్ల పడ్డ సంగతులు మనకు తెలుసే కదా?

అద్భుతాలను సృష్టిస్తున్న AI లాంటి టెక్నాలజీలను 2,3 రోజుల్లో నేర్చుకోవచ్చు.
కానీ, కోర్సులా నేర్చుకోవడానికి
సినిమా అంత సులువు కాదు, ఇది కళకు, ఒక కళాకారుడికి మధ్య జరిగే అంతర్యుద్ధం..

ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకొనే, ఒక సినిమా కథను వ్రాసి, అందరి మనసుల్లో దూరి విజయవంతమైన ఒక సినిమా రూపొందించాలంటే
కొన్ని సంవత్సరాల హృదయ వేదన, ఎన్నో నిద్రలేని రాత్రులు, అనుక్షణం అదే విషయాన్ని ఆలోచించే తీరు కావాలి, దానికి తోడు
ఎంతో మంది కళాకారుల సహకారం, అనుభవంతో మాత్రమే ఒక విజయవంతమైన సినిమా రూపొందించగలం.

AI టెక్నాలజీ సహాయంతో 2నిమిషాల్లో సినిమా తీసేయొచ్చు, 2గంటల్లో సినిమా తీయొచ్చు, 2రోజుల్లో సినిమా తీయొచ్చు అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే..

మంచి కెమెరా ఉన్నత మాత్రాన మంచి సినిమా చేయలేము కదా?

ఒక అందమైన దృశ్యాన్ని చిత్రీకరించడానికి ఎంతో డెప్త్ గా ఆలోచించే ఫిల్మ్ మేకర్ కావాలి కదా! .
ఇది అంతే.. నాలుగు రంగులు, ఒక మంచి బ్రష్ ఉంటే పెయింటింగ్ వేయలేం కదా? ఇది కూడా అంతే, భావోద్వేగమైన పెయింటింగ్ వేయాలంటే అంతే నైపుణ్యం కలిగిన ఆర్టిస్ట్ కావాలి కదా?
జీవం లేని యే కళ కూడా భావోద్వేగాన్ని చిత్రించలేదు అన్నది సత్యం.

ఇప్పుడు వస్తున్న AI టెక్నాలజీ కేవలం ఒక కథకు భారీతనాన్ని తొందరగా సమకూర్చగలదు అంతే, కానీ భావోద్వేగం కాదు,
మన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయగలదు కానీ , మన ఆలోచనను సృష్టించలేదు,

పాతది vs కొత్తది అన్న యుద్ధం అసలు కానే కాదు.

ఇది కేవలం ఊహకు అందించే కాన్సెప్ట్ మాత్రమే, అందుకే AI లో ఒకే కాన్సెప్ట్ కోసం వందలాది ఆప్షన్స్ వస్తాయి…
అందులో మళ్ళీ మనకు కావాల్సిన వాటిని ఎంచుకోవడం క్రియేటర్ పని కదా…

ఇంకో మాట చెప్పాలంటే.. సృజనాత్మకమైన సినిమా నిర్మించే ఆలోచన విధానం, భావోద్వేగమైన సినిమా రూపొందించే తీరు, అనుభవం, నిజాయితీ ఫిలిం మేకింగ్ AI టెక్నాలజీ కి అవసరం. ఇది నిజం,
ఇదే నిజం…

కొత్తగా సినిమా తీయాలనుకునే వారి సృష్టికి AI ఒక షార్ట్‌కట్ లాంటిది మాత్రమే,సృజనాత్మక ఆలోచనలు, భావోద్వేగ మైన కళను పూర్తిగా వదిలేయడానికి మాత్రం కానే కాదు.

AI టెక్నాలజీ నేర్చుకోండి, గౌరవించండి, మీ కథకు అవసరం అయ్యే విధంగా మలచుకోండి.
ఒక్క విషయం గుర్తుంచుకోండి.. యే AI టెక్నాలజీ ఒక సాగరసంగమం తీయలేదు, చరిత్ర సృష్టించిన శివ లాంటి సినిమాను రూపొందించలేదు,
యే AI టెక్నాలజీ టైటానిక్, జురాసిక్ పార్క్, అవతార్ టెక్నాలజీ బేస్డ్ సినిమాలను కూడా రూపొందించలేదు,

కథ, కథనాన్ని, సినిమా తీసే విధానాన్ని మార్చిపోకండి.

లక్ష్మణ్ మురారి శెట్టి
టాలీవుడ్ ఫిల్మ్ మేకర్

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments