HomeEntertainmentకుట్రలు, కుతంత్రాలను అధిగమించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "పెద్ది"

కుట్రలు, కుతంత్రాలను అధిగమించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “పెద్ది”

- Advertisment -

ఈరోజు (గురువారం) విడుదలైన “పెద్ది” సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అసాధారణ నటనతో సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసి ముందుకు నడిపించారు. ఆయన నటనను చూసిన అభిమానులు, ప్రేక్షకులు “న భూతో న భవిష్యతి” అనే స్థాయిలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ చిత్రంలో కుస్తీ పోరాటాలు, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాల ప్రదర్శనలో రామ్ చరణ్ చూపించిన అంకితభావం ప్రత్యేకంగా నిలిచింది. ఇలాంటి సాహసోపేతమైన కథను, క్లిష్టమైన పాత్రను చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. కానీ రామ్ చరణ్ ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేసినట్లు ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది.

ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. ఇప్పటికే భారీ స్టార్‌డమ్ ఉన్న హీరో ఇలాంటి విభిన్నమైన సబ్జెక్ట్‌ను ఎంచుకుని దాన్ని విజయవంతం చేయడం నిజంగా గొప్ప విషయం. అందుకే “పెద్ది” కేవలం ఒక సినిమా కాకుండా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారింది.

దక్షిణాది, ఉత్తరాది, ఓవర్సీస్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకులు సినిమాపై విశేష ఆసక్తి చూపుతున్నారు. అనేక ప్రాంతాల్లో టికెట్లు దొరకడం కష్టంగా మారిందని అభిమానులు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరికి మాట్లాడేది సినిమా కంటెంట్ మాత్రమే. మంచి సినిమా ఎప్పటికైనా ప్రజల్లోకి చేరుతుంది. “పెద్ది” విజయమే దానికి నిదర్శనం.

నటన పరంగా రామ్ చరణ్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను అందించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అలాగే “పెద్ది” చిత్రం నటన పరంగా, సాంకేతిక పరంగా, కథా పరంగా, ప్రేక్షకాదరణ పరంగా జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకునే స్థాయి చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది.
“పెద్ది” విజయంతో మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్టార్‌డమ్‌ను, నటుడిగా తన స్థాయిని నిరూపించుకున్నారు. ఈ చిత్రం భవిష్యత్తులో నటన, దర్శకత్వం, సంగీతం, ఇతర విభాగాల్లో అనేక అవార్డులతో పాటు జాతీయ అవార్డు స్థాయిలో కూడా గుర్తింపు పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇట్లు,
నట్టి కుమార్
Producer, Distributor & Exhibitor

జై రామ్ చరణ్! జై “పెద్ది”!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments