HomeEntertainmentయంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు "టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026" నిర్వహిస్తున్నాం :...

యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు “టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026” నిర్వహిస్తున్నాం : టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్

- Advertisment -
  • జూన్ 13 వరకు ఉచితంగా ఎంట్రీలు పంపే అవకాశం
  • జూన్ 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో అవార్డుల ప్రధానోత్సవం

చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని “టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026” ను టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు.
ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. 5 నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను ఔత్సాహిక దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పంపవచ్చు. ఎంట్రీలను జూన్ 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. జ్యూరీ ఎంపిక చేసిన విజేతలకు జూన్ 21న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తున్నామని, ఇకపై ప్రతి ఏడాది దీన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన పలువురు హీరోలు, దర్శకులు షార్ట్ ఫిలింల నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.
ఈ ఫెస్టివల్‌లో బెస్ట్ స్టోరీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ కో-ఆర్టిస్ట్, బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, జ్యూరీ అవార్డు, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ జర్నలిస్ట్ (ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా), బెస్ట్ ఫోటో జర్నలిస్ట్, బెస్ట్ కెమెరామెన్ తదితర దాదాపు 20 విభాగాల్లో అవార్డులు అందజేస్తామని తెలిపారు. కొత్త ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

టీఎఫ్‌సీసీ వైస్ ఛైర్మన్ గురురాజ్ మాట్లాడుతూ, కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడంలో డా. రామకృష్ణ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఫెస్టివల్ నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
టీఎఫ్‌సీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్సాఖాన్ మాట్లాడుతూ, షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా ఎంతోమందికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఎంట్రీలు రావడం ప్రారంభమైందని, జూన్ 13లోపు తమ చిత్రాలను పంపాలని కోరారు.

టీఎఫ్‌సీసీ వైస్ ఛైర్మన్ అల్లా భక్షు మాట్లాడుతూ, ఇతర ఫెస్టివల్స్ భారీ ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఉచితంగా అవకాశం కల్పించడం విశేషమని తెలిపారు. షార్ట్ ఫిలింల ద్వారా అనేకమంది నటీనటులు, దర్శకులు ఎదిగారన్నారు.

టీఎఫ్‌సీసీ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ, కొత్తవారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు తమ ఎంట్రీలను పంపి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ – 2026 కొత్త ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వేదికగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments