HomeEntertainmentఅప్పలసూరి నన్నుమళ్ళీ "లెజెండ్"ని చేస్తాడు

అప్పలసూరి నన్నుమళ్ళీ “లెజెండ్”ని చేస్తాడు

- Advertisment -

జగపతిబాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వెర్సటైల్ స్టార్ జగపతి బాబు సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘పెద్ది’లో అప్పలసూరి పాత్ర చాలా కొత్తగా కనిపిస్తోందని అందరూ అంటున్నారు.
ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుంది. ఆయన ఆ పాత్రను అలా ఉండాలని కోరుకున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌తో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి లుక్ ని డిజైన్ చేశారు. మొదటిసారి ఆ గెటప్ వేసుకున్నప్పుడే ఈ పాత్ర అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. గెటప్ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. ఈ సినిమా మొత్తం జగపతిబాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు.

-నాకు ఈ పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోషనల్‌గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చిన పాత్ర ఇది. రామ్ చరణ్ సినిమాలో ఈ పాత్ర చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. చరణ్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం.

-లెజెండ్ తర్వాత చాలా సినిమాలు చేశాను. కానీ వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ వాయిదారు వుంటాయి. ఆ జాబితాలో ‘పెద్ది’ మొదటి స్థానం దక్కించుకుంటుంది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments