కానీ……..
అలాంటి “చీప్ ట్రిక్స్”
అవసరమా??” అనిపించింది!!!
(ధీరజ అప్పాజీ)
నిన్న (మే 25) సాయంత్రం ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన “మా ఇంటి బంగారం” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యాను. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. రెండోసారి ప్లే చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేశాను. కంటెంట్ ఇదే రేంజ్ లో ఉంటే…. “నందిని రెడ్డి – సమంతా” ఖాతాల్లో మరో మంచి హిట్ పడడం ఖాయం అనిపించింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. మొదటి “జబర్దస్త్” అట్టర్ ప్లాప్. రెండోది “ఓ బేబి” సూపర్ హిట్.
సమంతా భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి రచయిత – నిర్మాత. “క్రియేటెడ్ బై రాజ్ నిడిమోరు” అని ట్రైలర్ లో, పోస్టర్స్ లో గర్వంగా వేసుకోవడం వల్ల కూడా… “మా ఇంటి బంగారం” కచ్చితంగా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపించింది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా అతనికున్న క్రెడిబిలిటీ అందరికీ తెలిసిందే!!
ఆఫీసు పని మీద పదే పదే బ్యాంకాక్ కు వెళ్లలేక తన భర్త “అల్లాడిపోతున్నాడు” అంటూ చేసిన హిలేరియస్ వీడియోతో (నేనే కనీసం ముప్పై నలభై సార్లు చూసి ఉంటాను) “రాత్రికి రాత్రి” పాపులర్ అయిపోయిన సింగర్ సమీరా భరద్వాజ… ఈ ఈవెంట్ యాంకరింగ్ చేసింది. మధ్యమధ్యలో చిన్న చిన్న తడబాట్లు, తేలికపాటి పొరపాట్లు మినహాయిస్తే… “తరలించబడ్డ ఫ్యాన్స్”తో హాల్ మొత్తం కిక్కిరిసిపోయిన ఈ వేడుకను ఈ కొత్త యాంకరమ్మ బాగానే హ్యాండిల్ చేసింది. ఈ చిత్రంలో నటించిన శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి కూడా ఈవెంట్ కి హాజరయ్యారు!!
కాకపోతే……….
ఈవెంట్ జరుగుతుండగా….
“ఓ కుర్రాడు, సెక్యూరిటీని “ఛేదించుకుని” స్టేజీ ఎక్కి, సమంత ముందు మోకాళ్ళపై కూర్చునిమరీ… సమంతకు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయడం, సెల్ఫీ దిగడం” (ఇప్పుడు సోషల్ మీడియాలో దీన్ని బాగానే వైరల్ చేస్తున్నారు) ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఇంకా “పకడ్బందీగా రిహార్సిల్” చేసి ఉంటే మరింత బాగుండేదనిపించింది!!
ఇప్పటికీ తన క్రేజ్ చెక్కు చెదరలేదని తన భర్తకు చూపించుకోవాలని సమంత అనుకుందా??… లేక రాజ్ నిడిమోరే ఈ చీప్ ట్రిక్ క్రియేట్ (డిజైన్) చేశాడా??…. ఈ రెండూ కాకుండా నందినిరెడ్డి తనలో ఇంకా దాగి ఉన్న “క్రియేటివిటీ”ని బయటకు తీసిందా…? అన్నది మాత్రం నాకు అర్ధం కాలేదు!!!!
Anyways….
All the best to
Entire Team!!💐

