యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన ‘గోదారి గట్టుపైన” విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ కథానాయిక, జగపతి బాబు కీలక పాత్రలో మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. థ్యాంక్స్ మీట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. “మూడేళ్ల తర్వాత నా సినిమా వస్తోంది. ‘ఎవరైనా టికెట్ కొంటారా?’ అని మా ఫ్రెండ్స్ అన్నప్పుడు నా మనసు కళుక్ మంది.
కానీ మేము థియేటర్లు విజిట్ చేస్తూ పల్లెటూర్లలో తిరిగినప్పుడు థియేటర్లలో కనిపించిన ఎనర్జీ మామూలుగా లేదు. ఫ్యామిలీలతో థియేటర్లు కలకలలాడడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ‘మేం ఫేమస్’ సినిమాను యూత్ కనెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

