HomeEntertainmentహీరో వడ్డే నవీన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

హీరో వడ్డే నవీన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

- Advertisment -

సీనియర్ నిర్మాత వడ్డే రమేష్ తనయుడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు హీరో వడ్డే నవీన్. ఆపై చక్కని అభిరుచితో విలక్షణమైన కథలను ఎంపిక చేసుకున్నారు వడ్డే నవీన్.


కోరుకున్న ప్రియుడు, స్నేహితులు, చాలా బాగుంది, మనసిచ్చి చూడు, పెళ్లి..వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు వడ్డే నవీన్. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎటాక్ సినిమా తర్వాత ఆయన మరే సినిమా చేయలేదు. తాను కోరుకున్న విలక్షణమైన కథలు క్యారెక్టర్లు తన దగ్గరికి రాకపోవడంతో వడ్డే నవీన్ సినిమాలకి కొంత విరామం ఇచ్చారు. దాదాపు దశాబ్దం తర్వాత తనే నిర్మాతగా, తనే హీరోగా ఒక సరికొత్త.. విలక్షణమైన కథాంశంతో కూడిన సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు వడ్డే నవీన్.

ఈ నేపథ్యంలో మే 11న వడ్డే నవీన్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత వడ్డే నవీన్ నటించిన తాజా చిత్రం..జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కాబోతోంది. (సినిమా వివరాలు వడ్డే నవీన్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయబోతున్నారు)వినూత్నమైన కథాంశంతో రూపొందినఈ తాజా చిత్రం ఘనవిజయం సాధించాలని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు అందజేశారు.

వడ్డే నవీన్ ని కలిసిన వారిలో సంస్థ అధ్యక్షులు బత్తుల జేవి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి,
కార్యవర్గ సభ్యులు ఆర్డీఎస్ ప్రకాష్, జిల్లా సురేష్ తదితరులు ఉన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments