HomeEntertainmentప్రతిభను ప్రపంచానికి పరిచయంచేసే మహత్తర చిత్రం M4M

ప్రతిభను ప్రపంచానికి పరిచయంచేసే మహత్తర చిత్రం M4M

- Advertisment -

దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల
ప్రతిభను ప్రపంచానికి పరిచయం
చేసే మహత్తర చిత్రం M4M

ఎన్నారై హీరోయిన్ జో శర్మ

ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీలో ప్రధాన పాత్రలో న‌టించిన అమెరికన్ నటి జో శర్మ మీడియా ప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

నా పేరు జో శర్మ. నేను శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) నుంచి వచ్చాను. Tollywood, బాలీవుడ్ తరహాలో వస్తున్న నా డెబ్యూ మూవీ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదలవుతోంది. మోహన్ వడ్లపట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘రాధ’, నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తాను.

నేను అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్‌ని, నాకు ఒక థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. మోహన్ గారి దగ్గర మూడేళ్లు శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాకి మోహన్ గారు, రాహుల్ అడబాల గారితో కలిసి నేను కో-రైటర్‌గా కూడా పనిచేశాను. కథా చర్చల్లో పాల్గొనడం వల్ల నా పాత్రను చాలా బలంగా డిజైన్ చేసుకున్నాను.

సినిమా రిలీజ్ కాకముందే మాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి. లాస్ ఏంజెల్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ నుంచి బెస్ట్ ఫిలిం, లండన్ ఫిలిం ఫెస్టివ‌ల్ నుంచి బెస్ట్ డైరెక్ట‌ర్, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివ‌ల్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్, హాలీవుడ్, శాంటా మోనికా తదితర ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటిగా నాకు, ఉత్తమ దర్శకుడిగా మోహన్ గారికి అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక ‘కేన్స్’ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా సినిమా గ్లోబల్ ప్రీమియర్ వేశారు. అక్కడ తెలుగు సినిమాను సబ్-టైటిల్స్‌తో చూసిన విదేశీయులు కూడా ఆశ్చర్యపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అది మాకు దక్కిన చాలా గొప్ప గౌరవం. అక్క‌డ మా సినిమాకు వ‌చ్చిన స్పంద‌న ఎంతో ఆత్మ‌విశ్వాసం క‌లిగింది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments