అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ విజయ పతాకం ఎగురవేశారు. “ఇదే నా చివరి సినిమా” అని ప్రకటించి మరీ అతను నటించిన “జననాయక” చిత్రం విడుదలకు ఎన్నో అవాంతరాలు సృష్టించి ఆపు చేయగలిగినవారు…. అతని విజయాన్ని మాత్రం అడ్డుకోలేక పోయారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక “జననాయకుడు” చిత్రం అటు తమిళంలో ఇటు తెలుగులో విడుదల కానుంది. కేవలం కొన్ని సీట్లకు మాత్రమే పరిమితం అవుతాడు…. ఓట్లు చేర్చడానికి మాత్రమే ఉపయోగపడతాడు… అనే విశ్లేషణలను చీల్చి చెండాడుతూ విజయ్ సాధించిన ఈ సంచలన విజయం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ ల తర్వాత తొలి ప్రయత్నంలోనే అధికారాన్ని చేజిక్కించుకున్న నాయకుడిగా విజయ్ భారత దేశ రాజకీయ మరియు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఎన్నికలకు ముందు కొందరు పనిగట్టుకుని అతని వ్యక్తిత్వ హననానికి పాల్పడినా కూడా ఏ మాత్రం చలించకుండా అతను ముందుకు సాగిన తీరు అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా ఇకపై సినిమా తారలకు రాజకీయాల్లో భవిష్యత్తు లేదంటూ ఇటీవల కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి చెంపదెబ్బలా ఈ విజయం నిలిచిందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు!!

