HomeEntertainmentకింగ్ నాగ్ కోసం బ్యూటీ క్వీన్

కింగ్ నాగ్ కోసం బ్యూటీ క్వీన్

- Advertisment -

కింగ్ నాగార్జున 100వ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ #King100 అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో జాయిన్ అయ్యారు. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

నాగార్జున, టబులది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. నాగార్జున–టబు కాంబినేషన్ లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. సిసింద్రీ’లో కూడా ఆమె ప్రత్యేకంగా కనిపించారు. ఇప్పుడు #King100లో వీరి రీయూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments