సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ సముద్రఖని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘తిరుపతి’గా ఆయన పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రానికి గ్యాని మ్యూజిక్ అందించారు. రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీ, వరప్రసాద్ ఎడిటర్.
