-సంగీత దర్శకుడిగా నూటికి నూటొకటి
ప్రముఖ గాయకుడు – సంగీత దర్శకుడు రఘు కుంచె టైటిల్ పాత్ర పోషించిన “గేదెల రాజు” నిన్న (ఏప్రిల్ 24) విడుదలైంది. చైతన్య మోటూరి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటుడిగా రఘు కుంచె తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంతోపాటు, సంగీత దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు.
కొత్త దర్శకుడు చైతన్య ఎంచుకున్న నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే (కాసేపు ముందుకి… కాసేపు వెనక్కి) కాస్త గందరగోళానికి గురి చేసేట్టు ఉండడం, క్యాస్టింగ్ (పాత్రల ఎంపిక పరంగా కాంప్రమైజ్ అవ్వాల్సిరావడం వంటి మైనస్ లను మినహాయిస్తే… సినిమా ఆద్యంతం అలరిస్తుంది.
ముఖ్యంగా సినిమా ప్రారంభం, ముగింపు చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఒకరిద్దరు తప్ప, నటీనటులంతా తమతమ పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడికి కూడా కచ్చితంగా మంచి భవిష్యత్ ఉంది. ముఖ్యంగా పవర్ ఫుల్ ప్రతి నాయక పాత్రల కోసం పక్క (రాష్ట్రాల) చూపులు చూడాల్సిన పని లేదని చాటిచెప్పుకున్న రఘు కుంచె… ఈ చిత్రానికి అందించిన పాటలు చాలా హృద్యంగా ఉన్నాయి. ముఖ్యంగా “ఉరికె చిరుగాలి ఏంచెయ్యమంటదే” పాట వింటున్నంతసేపు హాయిగా ఉంది. రఘు అందించిన నేపధ్య సంగీతం సైతం సన్నివేశాల్ని రక్తి కట్టించేలా ఉంది!!

