Thursday, February 5, 2026
HomeEntertainmentతెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపం "గొల్ల రామవ్వ"

తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపం “గొల్ల రామవ్వ”

- Advertisment -

ఈనెల 25 నుంచి ఈటీవీ విన్’లో!!

తెలుగుజాతి గర్వం, స్వర్గీయ భారత ప్రధాని – భారతరత్న పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపం “గొల్ల రామవ్వ”. ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ తనయుడు ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను… సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ – వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై… రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా… అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పేరొందిన పలు మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలిగిన అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు… సాహిత్యం సమకూర్చడం విశేషం!!

ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం “మౌనమే నీ భాష” చిత్రాన్ని నిర్మించి వీక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన టీమ్ నుంచి వస్తున్న “గొల్ల రామవ్వ” ఈనెల 25 (జనవరి 25) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. “తెలుగు సీతామాలక్ష్మి” తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్రలో… చిరస్మరణీయంగా నిలిచిపోనున్న ఈ చిత్రానికి… పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సంగీతం: సాయి మధుకర్, ఛాయాగ్రహణం: గంగమోని శేఖర్, కూర్పు: రాఘవేంద్రవర్మ, రచన: బయ్యవరపు రవి, కార్యనిర్వాహక నిర్మాత – సాహిత్యం: అజహర్ షేక్, నిర్మాతలు: రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి), చిత్రనువాదం – దర్శకత్వం: ముళ్ళపూడి వరా!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments