తిర్లక క్రియేషన్స్ పతాకంపై తిర్లక శ్రీనివాసరావు – తిర్లక బాలసుబ్రహ్మణ్యం సంయుక్తంగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ “యాంటి ఏజింగ్ వైఫ్”. బాలసుబ్రహ్మణ్యం – పుష్ప అనూష్ జంటగా నటిస్తున్న ఈ సిరీస్ కి “సాయికిరణ్ – రథన్ అనిల్ కృష్ణ” దర్శకులు. ఈ సిరీస్ హైదరాబాద్ లోని, నార్సింగ్ లో ముహూర్తం జరుపుకుంది. ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ ముఖ్య అతిధిగా పాల్గొని క్లాప్ కొట్టి, యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు!!
“పెళ్లయినప్పుడు ఎలా ఉందో… పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత కూడా అంతే అందంగా, యవ్వనంగా ఉండే భార్యతో భర్త పడే పడరాని పాట్లు… ఈ సిరీస్ మెయిన్ ప్లాట్ అని, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సిరీస్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఎన్. సురేష్ కుమార్, నాయిని శ్రీనివాసరావు, సి.హెచ్.బాలాజీ. రథన్ అనిల్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి రచన: రథన్ అనిల్ కృష్ణ, కెమెరా: నవీన్, నిర్మాతలు: శ్రీనివాసరావు – తిర్లక బాలసుబ్రహ్మణ్యం, దర్శకత్వం: సాయికిరణ్ – రథన్ అనిల్ కృష్ణ!!

