Sunday, February 22, 2026
HomeEntertainment"గర్ల్ ఫ్రెండ్" చిత్రంలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?

“గర్ల్ ఫ్రెండ్” చిత్రంలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?

- Advertisment -

పురిట్లోనే తల్లి చనిపోతే తన కూతుర్ని తల్లి తండ్రి తానే అయి పెంచుతాడు. కానీ తను బాయ్ ఫ్రెండ్ తో కనపడగానే కోపం వస్తుంది. కానీ ఆమె మాటలు అర్ధం చేసుకోక పోవడం ఏంటి అదేం తండ్రి ప్రేమ?
భూమ ఇంగ్లిష్ లిటరేచర్ చదవటానికి యూనివర్సిటీలో జాయిన్ అవుతుంది
ఆమెను చూడగానే ప్రేమిస్తాడు హీరో విక్రమ్ మొదటి చూపులోనే ఆమె కళ్ళల్లో కనిపించే భయం అతనికి చాలా నచ్చేలా చేస్తుంది. భూమి మంచి అమ్మాయి. బుద్ధిగా సాంప్రదాయంగా ఉండే అమ్మాయి ఇలాంటి బ్రాండ్ అమ్మాయిలు అందరికీ నచ్చేస్తారు.
విక్రమ్ కి నచ్చుతుంది. రెగ్యులర్ సినిమా ఫక్కీలో అమ్మాయిని హీరోయిజం చూపించి ఆమెను ప్రేమలో పడేస్తాడు. .ప్రేమంటే కలకాలం కలిసి ఉండటం… లేక కలిసి చావటం.. మోసం చేయకుండా ఉండటం , ఇవే కదా మన రెగ్యులర్ ప్రేమ కథలు. మూవీ చూస్తూ ఉన్నంతసేపు 100 సంవత్సరాల మూవీలు… ప్రేమకథలను చూసి దర్శకుడు నవ్వు తున్నట్లు కనపడింది.
సంప్రదాయం అనే భవంతులు కట్టడానికి కూలీల్లా… స్త్రీ జాతి కష్టపడాలి… కానీ వాటిలో విశ్రాంతి తీసుకోవడం మగాడి నైజం. తాళిబొట్టు, కుంకుమబొట్టు, చీరలు గాజులు సంప్రదాయ సంకెళ్లు స్వేచ్ఛ లేని
కట్టు బట్టలు, కట్టుబాట్లు.
మగాడికి లేని ఎథిక్స్
స్త్రీకి మాత్రం చాల థిక్స్.
ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో గదిలో కనిపిస్తే కోపం ప్రదర్శించే ఆమె తండ్రి
కొడుకు అలాగే గర్ల్ ఫ్రెండ్ తో కనిపిస్తే అలాగే రియాక్ట్ అవుతాడా అంటే కాదు మందలించి ఊరుకుంటాడు అని చాలా మంది అమ్మాయిలు సర్వేలో చెప్పారు.
సమాజంలో న్యాయం పురుషులుకి వేరు స్త్రీకి వేరు.
పాత చింతకాయ పచ్చడి కొత్త జాడిలో పెట్టినట్టు హీరో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని పెళ్ళి అనే బంధం లో నిర్బంధిస్తే వీడు ప్రేమ బంధంలో నిర్భందిస్తాడు. వాళ్ళ నాన్న సమాజంలో ఎథిక్స్ అనే సంకెళ్ళతో బంధిస్తాడు.
సంప్రదాయాలు మన జీవన యానంలో లంగరులా ఉండాలి మన సంస్కృతి ఒక ప్రపంచంలో తలమానికంగా ఉండాలి. మన సంప్రదాయలు గొప్పవి అని చెప్పాలంటే మొదట మనం మానవీయ విలువలు కాపాడాలి. ప్రతి మనిషి స్వేచ్ఛ కాపాడాలి. గుర్రం చేయండ్ర అంటే గాడిదను చేసినట్టు
సంప్రదాయం పరువు తీస్తున్నారు.
పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? సమాజంలో వాళ్ళ డిగ్నిటి పోతుంది అన్న భయం. ఓవర్ అబ్సెసివ్ నెస్ సమాజంలో గొప్పగా ఉండాలనే తపన సొంత బిడ్డలను సైతం అర్థం చేసుకోని దురాగతం!!

-సీతా మాధవి ఏలూరి

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments