HomeEntertainmentవీకే సినిమా బ్యానర్‌పై “TL 2.7” నూతన చిత్ర ప్రారంభ పూజ కార్యక్రమం స్థానిక పైడా...

వీకే సినిమా బ్యానర్‌పై “TL 2.7” నూతన చిత్ర ప్రారంభ పూజ కార్యక్రమం స్థానిక పైడా కాలేజ్ బోయపాలెం వెంకటేశ్వర కోవెలలో ఘనంగా నిర్వహణ

- Advertisment -

వీకే సినిమా పతాకంపై రూపొందనున్న నూతన చిత్రం “TL2.7” ప్రారంభ పూజ కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా వెంకటేశ్వర స్వామి గుడి, పైడా కాలేజీ, బోయపాలెం లో జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు శ్రీ రవితేజ గారు తొలి క్లాప్ ఇచ్చి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభ పూజ కార్యక్రమానికి పలువురు సీనియర్ టీ.వి, సినీ రంగ ప్రముఖులు, అతిథులు గా హాజరై చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అంతా సానుకూల వాతావరణంలో, ఉత్సాహభరితంగా కొనసాగింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్యన్ అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కో-డైరెక్టర్‌గా పని చేస్తూ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పుష్ప కొండూరు గారు సంగీత దర్శకురాలిగా పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు & రచయిత వెంకట్ కొండూరు వీకే మాట్లాడుతూ,
“TL 2.7 ఒక పూర్తిగా విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. ప్రతి వయసు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుంది. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం” అని తెలిపారు. సినీ నటులు రవితేజ చిత్ర బృందానికి నటీనటులకు అభినందనలు తెలిపారు

వీకే సినిమా సంస్థ ఈ చిత్రాన్ని ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నట్లు తెలిపింది. ప్రారంభ పూజతోనే మంచి వైబ్రేషన్స్ అందుకున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments