పరువు నష్టం దావా ఉపసంహరణ వెనుక ఉన్నది ఎవరు?
నాగార్జున, సమంతలపై తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని, అందుకు గాను విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ ప్రకటించడం, ఆగమేఘాలపై నాగార్జున తను పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవడం వెనుక ఓ వివాదాస్పద దర్శకుడు ఉన్నాడని తెలిస్తోంది. నాగార్జున సినిమాతో దర్శకుడై, కొండా కుటుంబంతోనూ అనుబంధం కలిగిన ఈ దర్శకుడు… ఈ విషయంలో కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. సినిమా పరంగా కొండా కుటుంబానికి న్యాయం చేయలేకపోయినా… రాజకీయంగానూ కీలకంగా మారిన ఈ కేసు విషయంలో కొండా కుటుంబానికి ఈవిధంగా సహాయపడిన ఆ దర్శకుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది? తాను ఇప్పుడు మారిన మనిషినని చెప్పుకుంటూ తిరుగుతుండడంతోపాటు… గతంలో తన వ్యవహారశైలిపై క్షమాపణలు చెప్పుకుంటున్న రాంగోపాల్ వర్మ… ఇకపై తన నుంచి మళ్ళీ… “శివ, సత్య, రంగీల” వంటి సినిమాలు వస్తాయని హామీ ఇస్తున్నాడు.
ఎవరా పుణ్యాత్ముడు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
