హారర్, థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ధాత్రి’. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్‌లోని కాన్సెప్ట్, విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయని ప్రశంసించిన ఆయన, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సంజన ఫిలిమ్స్ బ్యానర్‌పై గిరి పయ్యావుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లక్కీ వెంకట్, శ్రావణి, ఆధ్య శర్మ, గిరి పయ్యావుల, జబర్‌దస్త్ జీవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గిరి పయ్యావుల స్వయంగా నిర్మిస్తుండగా, సాయి చరణ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్ర కథ ఆసక్తికరమైన నేపథ్యంలో సాగుతుంది. చిన్నతనంలో అనాథగా మిగిలిపోయిన ఓ బాలికను కాశీలోని కొంతమంది అఘోరాలు పెంచి పెద్ద చేస్తారు. ఆ అనాథ పేరు ‘ధాత్రి’. మరోవైపు ఎన్నో అసాంఘిక కార్యకలాపాలతో ఒక గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న దుష్టశక్తులకు ఎదురు నిలిచిన ధాత్రి… ఆ గ్రామాన్ని ఎలా రక్షించింది? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. హారర్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ సినిమా చిత్రీకరణను కాశీ, వారణాసి, బాపట్ల, హైదరాబాద్, కొమరవల్లి తదితర ప్రాంతాల్లో పూర్తి చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తుండగా, చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాతలు.
సాంకేతిక నిపుణులు
చిత్రం: ధాత్రి
నటీనటులు: లక్కీ వెంకట్, శ్రావణి, ఆధ్య శర్మ, గిరి పయ్యావుల, జబర్‌దస్త్ జీవన్
దర్శకత్వం – నిర్మాత: గిరి పయ్యావుల
సమర్పణ: సాయి చరణ్
కథ – స్క్రీన్‌ప్లే: సంజన ఫిలిమ్స్ టీమ్
సహ నిర్మాతలు: సి. లక్ష్మీ నారాయణ గౌడ్, టి. లక్ష్మీ మణికంఠ
లైన్ ప్రొడ్యూసర్: పుట్టగంటి రామదుర్గాదేవి
అసోసియేట్ డైరెక్టర్: బ్రహ్మయ్య
సంగీతం: నవనీత్ చారి
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కావేటి
ఎడిటర్: ఎంఎన్ఆర్
డిఐ: సునీల్ కుమార్
వీఎఫ్ఎక్స్: సంజు, కోరిట్ల రామకృష్ణ, రైవర్ర
సాహిత్యం: లక్ష్మీ భాస్కర్

