మహేష్ – ప్రభాస్ – అల్లు అర్జున్ సినిమాల విడుదల తేదీలపై అనిశ్చితి
టాలీవుడ్‌లో ముగ్గురు అగ్ర కథానాయకుల తదుపరి చిత్రాల విడుదల తేదీలపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మహేష్‌బాబు – రాజమౌళి కలయికలో వస్తున్న ‘వారణాసి’, ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’, అల్లు అర్జున్ – అట్లీ చిత్రం ‘రాకా’… ఈ మూడు సినిమాలూ భారీ అంచనాలతో తెరకెక్కుతున్నవే.

వారణాసి: రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు చేస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా విడుదల తేదీ మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
స్పిరిట్: ప్రభాస్ రెబల్ పోలీస్ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. వంగా మార్కు యాక్షన్, ఎమోషన్స్‌పై భారీ అంచనాలున్నాయి. తొలుత మార్చి 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం అక్టోబర్ 29, 2027కు వాయిదా పడింది.
రాకా: పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్, భారీ విజువల్ గ్రాండియర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. అయితే విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మూడు చిత్రాలూ మూడు విభిన్న నేపథ్యాలు, ముగ్గురు విలక్షణ దర్శకులు, ముగ్గురు అగ్రహీరోలు! 2027లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఎలాంటి సంచలనం సృష్టిస్తాయన్నది ఆసక్తికరం. ముఖ్యంగా ఈ మూడు సినిమాల విడుదల తేదీలపై దోబూచులాట నడుస్తుండడం గమనార్హం. ముగ్గురి సినిమాల చుట్టూ విడుదల తేదీల మల్లగుల్లాలు మాత్రం కొనసాగుతున్నాయి!
