యంగ్ ట్యాలెంట్ తిరువీర్, వెర్సటైల్ ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా ‘ఓ..! సుకుమారి’ అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘శివం భజే’ చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు. ప్రధాన నటీనటుల ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది!!

