Friday, December 5, 2025
HomeEntertainmentగీతా సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా ఎ క‌ప్ ఆఫ్ టీ..వాట్ హాపెండ్...

గీతా సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా ఎ క‌ప్ ఆఫ్ టీ..వాట్ హాపెండ్ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

- Advertisment -

గీతా సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ఎ క‌ప్ ఆఫ్ టీ. నేటి యువ‌తకు న‌చ్చే క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ద్వారా ఎఫ్పీ రోజ‌ర్స్‌, నిఖిత రావు ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్టిస్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై మ‌నోజ్ కృష్ణ‌, న‌వీన్ కృష్ణ నిర్మించారు. జ‌య శ్రీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో న‌టుడు రాకేష్ ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ నుండి వాట్ హాపెండ్ అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. డైస్ ఆర్ట్స్ ఫిల్మ్స్ ఈ ఈవెంట్‌ని గ్రాండ్ గా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో..

హీరో మ‌నోజ్ మాట్లాడుతూ –మా సినిమాను జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డానికి మేము ఎంచుకున్న మార్గ‌మే ఈ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్..ఈ పాట‌తో మా సినిమాని ప్ర‌మోట్ చేసి థియేటర్స్ వ‌ర‌కూ తీసుకెళ్లాలి అన్న‌దే మా టీమ్‌ ఉద్దేశ్యం..పెద్ద సినిమాల వ‌ల్ల చిన్న సినిమాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న‌ది ఈ పాట‌లో ఫ‌న్నీగా చూపించే ప్ర‌య‌త్నం చేశాం. ఈ సినిమా ఒక యంగ్‌స్ట‌ర్ జ‌ర్నీ..ఒక కాలేజ్ యువ‌త జ‌ర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది..అది ఎలా డీవియేట్ అవుతుంది దాని వ‌ల్ల వ‌చ్చే ప‌రిణామాలు ఏంటి అన్నది ఈ సినిమాలో చూపించాం. నేటి యువ‌త త‌ప్ప‌క చూడాల్సిన సినిమా..డైరెక్ట‌ర్ ఎఫ్పీ రోజ‌ర్స్‌ గారు వ‌చ్చి ఈ క‌థ చెప్ప‌గానే చాలా న‌చ్చింది. గీత సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత మ‌ళ్లీ నాకు అంత హై ఇచ్చిన ఫిల్మ్ ఇది. ఈ సినిమా మీద నేను, మా టీమ్ అంద‌రం చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. త్వ‌రతోనే మీడియా వారికి ఒక ప్రీవ్యూ ప్లాన్ చేస్తున్నాం..మా హీరోయిన్ జ‌య‌త్రీ చాలా బాగా చేసింది. ఆమె క్యారెక్ట‌ర్ నేటి యువ‌త‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. మా టీమ్ అంద‌రికీ మీ స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తిక్ రోడ్ర‌విజ్‌ మాట్లాడుతూ- మాది చిన్న సినిమా అయినా మ్యూజిక్‌, మేకింగ్ కి మ‌నోజ్ చాలా ఖ‌ర్చు పెట్టారు. పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కులు మంచి ఔట్‌పుట్ తీసుకువ‌చ్చారు. ఆదిత్య ఒక మంచి క్యారెక్ట‌ర్లో క‌నిపిస్తారు. టీమ్ అంద‌రు చాలా క‌ష్ట‌ప‌డి బెస్ట్ ఔట్ పుట్ తీసుకువ‌చ్చారు. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ క‌మ‌ల్ నాబ్‌ మాట్లాడుతూ – ఈ సినిమాకి మ‌నోజ్ ఒక్క‌డే వ‌న్ మ్యాన్ ఆర్మీ..అన్నీ తానే చూసుకున్నాడు.. మ‌నోజ్ కి యాక్టింగ్ అంటే ప్యాష‌న్‌..ఆ ప్యాష‌న్‌తోనే చాలా క‌ష్ట‌ప‌డి సినిమా కంప్లీట్ చేశాడు..సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఒక బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ..ఒక లైఫ్ స్టోరీ అని చెప్పొచ్చు. యువ‌త‌రం అంద‌రికీ త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. మా ఫ‌స్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డం హ్యాపీ అన్నారు.

న‌టుడు రాకేష్ మాట్లాడుతూ- నేను మ‌నోజ్‌కి చాలా పెద్ద ఫ్యాన్.. గీత సుబ్ర‌మ‌ణ్యం సిరీస్‌ టైమ్‌లో త‌న క్రేజ్ ఏంటో..ఏ రేంజ్లో ఉండేవాడో నాకు తెలుసు..ఆ టైమ్‌లో త‌న‌కి చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చేవి..అప్పుడే నువ్వు సినిమా చేస్తే నాకు ఒక క్యారెక్ట‌ర్ ఇవ్వు అని అడిగాను.. ఒక ఆర్టిస్ట్‌గా ఈ స‌మాజానికి మంచి చేయాలనే ఈ క‌థ ఎంచుకున్నాడు. ఎలాంటి వ‌ల్గారిటీ లేని ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీ..ఈ క‌థ‌లో త‌న‌తో పాటు ట్రావెల్ చేసే క్యారెక్ట‌ర్..ఈ పాత్ర నాకు రావ‌డానికి కార‌ణ‌మైన మ‌నోజ్ కి థ్యాంక్స్‌..ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి..హీరోగా మ‌నోజ్ బాగా బిజీ అవ్వాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

మ‌నోజ్ కృష్ణ‌, జ‌య‌శ్రీ‌, రాకేష్, రవితేజ నన్నిమల త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం – ఎఫ్పీ రోజ‌ర్స్‌, నికిత రావు
నిర్మాత‌లు: మ‌నోజ్ కృష్ణ త‌న్నీరు, న‌వీన్ కృష్ణ త‌న్నీరు
బ్యాన‌ర్‌: ఆర్టిస్ట్ క్రియేష‌న్‌
సంగీతం: కార్తీక్ రోడ్రిగెజ్
సినిమాటోగ్ర‌ఫి: క‌మ‌ల్ నాబ్‌
ఎడిట‌ర్‌: ఎఫ్పి రోజ‌ర్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: మ‌హేష్ పెద్ద‌బోయిన‌
కో-రైట‌ర్స్‌: ఇసాక్ పాల్‌, నిఖిత రావు, ఎఫ్పీ రోజ‌ర్స్‌
వీఎఫ్ఎక్స్‌: భాష‌
మార్కెటింగ్‌: ద యాష్‌ప్లుయెన్స్ డిజి మార్కెటింగ్
స్టుడియో, గ్రాఫిక్ డిజైన్‌: లైట్ & లైఫ్ స్టుడియో
ఈవెంట్స్‌: డైస్ ఆర్ట్ ఫిలిమ్స్‌

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments