Friday, December 5, 2025
HomeEntertainmentఈ నెల 21న తెలుగులో విడుదల అవుతున్న 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్' మూవీ

ఈ నెల 21న తెలుగులో విడుదల అవుతున్న ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ మూవీ

- Advertisment -

▪2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన మూవీ
▪ నవంబర్ 21న తెలుగు రాష్ట్రాల్లో విడుదల

హైదరాబాద్: వరల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ (The Face of the Faceless) మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈ మూవీ నవంబర్ 21న తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలింఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ.. ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్ కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్ గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమా ను ప్రతీ ఒక్కరూ ప్రమోట్ చేయాలి. 123 అవార్డులు పొందిన సినిమా ఇది. ఆస్కార్ కు కూడా ఎంట్రీ వచ్చిన సినిమా. నవంబర్ 21న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.

దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ మాట్లాడుతూ.. “క్షమాపణ అనేది గొప్పది. ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. చాగంటి ప్రొడక్షన్స్ సపోర్ట్ చేస్తుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ..”గొంతుక లేని వారికి గొంతుక అందించే సినిమా ఇది. మన సమాజంలో ప్రేమ గురించి, శాంతి గురించి క్షమాపణ విలువను ఈ సినిమా తెలుపుతుంది. తెలుగు రాష్ట్రాలలో 50-60 థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సీమను ఆదరిద్దాం తెలుగులోను హిట్ చేద్దాం” అని అన్నారు.

CSI బిషప్ విల్సన్ మాట్లాడుతూ.. ”ప్రేమించడానికి ధైర్యం కావాలి. క్షమించడానికి ధైర్యం కావాలి. ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమా ఇది. ప్రధాన పాత్ర అట్టడుగున ఉన్న వారికి సహాయపడే పాత్ర. హర్ట్ టచింగ్ స్టోరీ.” అని అన్నారు.

డైరెక్టర్ వంశీకృష్ణ మాట్లాడతూ.. “హరి హారన్, చిత్ర వంటి దిగ్గజలు ఈ సినిమాలో పాడారు. ఇలాంటి మానవత్వం కలిగిన ప్రపంచ స్థాయి సినిమాలను ప్రతీ ఒక్కరూ సపోర్ట్ చేద్దాం. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంతో అవసరం.” అని అన్నారు.

నటుడు జక్కుల కృష్ణ మోహన్ మాట్లాడుతూ… “ఈ సినిమాలో గుస్ బమ్స్ వచ్చే సీన్లు ఉన్నాయి. ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. నవంబర్ 21న తెలుగు వెర్షన్ ను కూడా భారీ స్థాయిలో హిట్ చేద్దాం” అని అన్నారు.

కాథలిక్ మత సోదరి, సామాజిక కార్యకర్త సీనియర్ రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది, ఆమె పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసింది. ఈ చిత్రం సీనియర్ రాణి మరియా వట్టలిల్ ఎదుర్కొన్న కష్టాల గురించి. ఆమె అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేసింది. ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్‌లో విన్సీ అలోషియస్ సీనియర్ రానియా మరియా పాత్రను పోషించారు.

Director: Shaison p. Ouseph
Producer: Sandra D’souza Rana
Executive Producer: Ranjan abraham
Creations: try light
PRO : Kadali Rambabu, Dayyala Ashok.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments