ఒకప్పుడు వరస విజయాలతో విరాజిల్లిన బహుముఖ ప్రతిభాశాలి ఎస్.వి.కృష్ణారెడ్డిని ఇటీవలకాలంలో “విజయం” దోబూచులాడుతోంది. ఆయన స్థానంలో / స్థాయిలో మరొకరెవరైనా ఉండి ఉంటే, అస్త్ర (దర్శక) సన్యాసం చేసి, విశ్రాంత జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు.

కానీ ఆయన మాత్రం రెట్టించిన ఉత్సాహంతో… ఒకప్పుడు తన వెన్నంటే ఉండి, తనను ముందుకు నడిపించి, ఇప్పుడు అకారణంగా తనపై సీత కన్ను వేసిన విజయలక్ష్మిని తనదైన శైలిలో మళ్ళీ మచ్చిక చేసుకునేందుకు మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన మొదలు పెట్టిన “వేదవ్యాస్” చిత్రంతో దర్శకుడిగా ఎస్.వి.కృష్ణారెడ్డి పూర్వవైభవం పొందాలని, ఆయన దర్శకత్వంలో మరిన్ని సూపర్ హిట్స్ రావాలని… ఆయన అభిమానులంతా మనసారా కోరుకుంటున్నారు!!
