Sunday, June 1, 2025

Top 5 This Week

Related Posts

షెర్లాక్ హోమ్స్జాక్ పాట్ కొట్టాడు

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటించిన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ థ్రిల్లర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ సినిమాకి రైటర్ మోహన్ దర్శకత్వం వహించారు. శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించారు. లాస్యారెడ్డి సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 25 న క్రిస్మస్ సందర్భంగా “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌”ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. “2018, పొలిమేర, కమిటీ కుర్రాళ్ళు, క” లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సీయా గౌతమ్‌ మరో హీరోయిన్ గా నటిస్తుండగా, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్‌, మురళీధర్‌ గౌడ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles