Friday, December 5, 2025
HomeEntertainmentనిజాయితీగా కష్టపడి సినిమా చేస్తే దేవుడు సక్సెస్ ఇస్తాడని "రాజు వెడ్స్ రాంబాయి" ప్రూవ్ చేసింది...

నిజాయితీగా కష్టపడి సినిమా చేస్తే దేవుడు సక్సెస్ ఇస్తాడని “రాజు వెడ్స్ రాంబాయి” ప్రూవ్ చేసింది – సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో శ్రీ విష్ణు

- Advertisment -

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీ నుంచి నేను అప్పుడప్పుడు డైవర్ట్ అవుతుంటాను. కానీ ఈ సినిమా తర్వాత సినిమాను వదిలి వెళ్లొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యా. ఈ మూవీ టీమ్ సినిమాను కష్టపడి ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లిన విధానం నాలో స్ఫూర్తినింపింది. రాంబాయి పాట హిట్ కావడానికి నాతో పాటు నా టీమ్ అంతా కారణం. అన్నారు.

నటి అనితా చౌదరి మాట్లాడుతూ – ఈ సినిమా నటిగా నాకు కొత్త జీవితాన్ని, కొత్త ఆశనూ కల్పించింది. ఈ సినిమా విజయం సాధిస్తుందని మా అందరికీ తెలుసు. నేను సినిమాలతో పాటు ఓటీటీలోనూ చేయాలని ఈటీవీ విన్ టీమ్ ఎంకరేజ్ చేసింది. లిటిల్ హార్ట్స్ తర్వాత “రాజు వెడ్స్ రాంబాయి” నాకు సక్సెస్ అందించింది. అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుందే అలాంటి చిత్రమిది. ఈ సినిమాలో అఖిల్ తో పాటు నితిన్, సాయి, వంశీ, బన్నీ వాస్ ఇలా.. చాలా మంది హీరోలు ఉన్నారు. ఈ చిత్రం సాయిలు అనే ఒక వజ్రం లాంటి దర్శకుడిని ఇండస్ట్రీకి అందించింది. చైతన్య బిజీ విలన్ అవుతాడు. మురారి టైమ్ లో కృష్ణవంశీ మాట మీద అనితా చౌదరికి సరదాగా లవ్ లెటర్ రాస్తే మా ఆవిడకు చూపించింది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను పెద్ద హిట్ చేసిన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈటీవీ విన్ లో టెక్నీషియన్స్ ను గౌరవిస్తారు. దర్శకుడు సాయిలు మనసులో ఉన్నదే తెరపై మనకు చూపించారు. అఖిల్ ఎంతోకాలంగా ఎదురుచూసిన హిట్ ఈ చిత్రంతో దక్కింది. చైతన్య స్క్రీన్ మీద కనిపించినప్పుడు థియేటర్స్ లో ప్రేక్షకుల అరుపులు వినిపిస్తున్నాయి. అన్నారు.

ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ – మా సినిమా బాగుంటుందని మేము చెప్పిన మాటల్ని నమ్మి థియేటర్స్ కు వెళ్లిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. ఇలాంటి నేటివ్, రూరల్ సినిమాను ఆడియెన్స్ కు రీచ్ చేయాలనే 99 రూపాయిలు టికెట్ రేట్ పెట్టాం. మాకొచ్చిన కాంప్లిమెంట్స్ లో ఒక నలుగురు ఫ్రెండ్స్ పంపిన కాంప్లిమెంట్ గురించి చెబుతాను. నలుగురు ఫ్రెండ్స్ మా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు వెళ్లి స్నాక్స్ తో సహా ఖర్చు చేస్తే 600 రూ పాయలు అయ్యిందట. ఈ కాంప్లిమెంట్ మాట విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. రూ.99 టికెట్ రేట్ గురించి కాంట్రవర్సీ జరిగినా చాలావరకు అందరినీ ఒప్పించగలిగాం. అన్నారు.

ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా రిలీజ్ టైమ్ లో చాలా టెన్షన్ పడ్డాం. దేవుడు మా వైపు ఉన్నాడు. సక్సెస్ ఇచ్చాడు. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే. అయినా ప్రతి సెంటర్ లో ఆడియెన్స్ ఈ సినిమాలోని ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతున్నారు. గ్రామాలు, నగరాలు అని తేడా లేకుండా అన్ని చోట్లా మా సినిమా సూపర్ హిట్ అనే టాక్ వినిపిస్తోంది. అన్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ – ఈ సినిమా నాకు పెద్ద కొడుకు లాంటిది. నేను ఇండస్ట్రీలో నిలబడేందుకు కావాల్సినంత సపోర్ట్ ఇచ్చింది. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను నా జీవితంలో మర్చిపోలేను. మా చిత్రాన్ని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు వంశీ నందిపాటి, బన్నీ వాస్ వచ్చారు. వాళ్లు రాగానే మాకు ఎంతో ధైర్యం వచ్చింది. ఈటీవీ విన్ నితిన్, సాయి ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వేణు ఊడుగుల అన్న లేకుంటే నేను ఈ వేదిక మీద ఉండేవాడిని కాదు. అన్నారు.

ప్రొడ్యూసర్ రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” పీపుల్స్ మూవీ. ఆర్ట్ ఫామ్ కు చిన్నా పెద్దా తేడా లేదని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. ప్రేక్షకులే తమ అభిరుచిని చాటి విజయాన్ని అందించారు కాబట్టి ఇది పీపుల్స్ మూవీ. ఈ సినిమా కోసం ఈటీవీ విన్ సాయి, నితిన్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఆడియెన్స్ దగ్గరకు బాగా రీచ్ చేశారు. మా సినిమాకు తమ సపోర్ట్ అందించిన హీరోలు మంచు మనోజ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణుకు థ్యాంక్స్. అన్నారు.

డైరెక్టర్, ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ – మా సినిమాను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం మేము అవమానాలు పడ్డాం. రిలీజ్ ముందు ఓ ప్రొడ్యూసర్ కు సినిమా చూపిస్తే తన ఫ్రెండ్స్ తో వచ్చి చూసి చెప్పా పెట్టకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్లాడు. సినిమా చూసి మాతో కనీసం మాట్లాడకుండా వెళ్లిపోవడం మా క్రియేటివిటీని అవమానించడమే. పైగా బయటకు వెళ్లి ఇదేం సినిమా అంటూ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టాడు. నువ్వు డైరెక్షన్ చేసుకోకుండా ఈ ప్రొడ్యూసర్ కష్టాలు ఎందుకని నా సన్నిహితులు అనేవారు. కానీ ఈ రోజు ప్రేక్షకులు మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. మా సినిమా కోసం టీమ్ అంతా రెండేళ్లు కష్టపడ్డాం. సాయిలు తెలుగు పరిశ్రమకు ఒక వెట్రిమారన్, మారి సెల్వరాజ్ అవుతాడు. అతనిలోని ఇన్నోసెన్స్, నిజాయితీ గమనించాక నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – ఈ సినిమా ఓటీటీ కోసం చేస్తున్నావా అని కొందరు అడిగితే నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నా అని చెప్పా. రాంబాయి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక్క పాటతో సినిమా హిట్ కాదు అన్నారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక తెలంగాణ నేపథ్యం కాబట్టి నైజాంలో మీరు పెట్టిన డబ్బులు వస్తాయి అన్నారు. ప్రీమియర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, టికెట్ సేల్స్ అలా మాట్లాడిన వాళ్ల మాటలకు సమాధానం ఇచ్చాయి. ఈ జర్నీలో మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఈటీవీ బాపినీడు గారు. అఖిల్ నాని, విజయ్ దేవరకొండలా పేరు తెచ్చుకుంటాడు. తేజస్వినీ అందం అభినయంతో ఆకట్టుకుంటుంది. చైతన్య విలన్ గా మరో ఇరవై ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాడు. మా డైరెక్టర్ ఫ్యూచర్ రాజమౌళి అవుతాడు. వేణు అన్నకు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు హీరో. అన్నారు.

యాక్టర్ చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ – ఈ సినిమా ఇటీవీ విన్ వారి బాహుబలి. రెండేళ్లు ఈ సినిమా కోసం వాళ్లు కష్టపడ్డారు. అఖిల్ ఈ చిత్రంతో నాని, విజయ్ దేవరకొండలా పేరు తెచ్చుకుంటాడు. తేజస్వినీ మంచి యాక్ట్రెస్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నైజాం టూర్ చేసినప్పుడు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఏపీ టూర్ కు కూడా వెళ్తున్నాం. విజయవాడ, రాజమండ్రి, వైజాగ్..ఇలా థియేటర్స్ విజిట్ చేయబోతున్నాం. అన్నారు.

హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను చేసిన రాంబాయి క్యారెక్టర్ ను ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు. మేము థియేటర్స్ విజిట్ వెళ్లినప్పుడు వాళ్ల రెస్పాన్స్ చూసి హ్యాపీగా అనిపించింది. మా మూవీని మేము ఊహించినదానికంటే పెద్ద సక్సెస్ చేశారు. రీల్స్, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న తెలుగు అమ్మాయిలకు నేను ఇస్తున్న సజెషన్ ఒక్కటే. మీరు లైఫ్ లో కోరుకున్నది చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎవరు నిరుత్సాపరిచినా, అడ్డుంకులు పెట్టినా మీ జర్నీ ఆపకండి. నేను ఇలాంటి వేదిక మీద నిలబడి మాట్లాడుతానని ఊహించలేదు. నాలా మీరు కూడా సక్సెస్ అందుకుంటారు. అన్నారు.

హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ – ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతోమంది స్టార్స్ అయ్యారు. నేనూ అలా కావాలనే కలగన్నాను. ఈ చిత్రంతో ప్రేక్షకులు నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చారు. చూడ్డానికి బాగున్నావ్, నీకు మార్కెట్ లేదు అని గతంలో కొందరు ప్రొడ్యూసర్స్ అనేవారు. కానీ నాకూ ఒక స్పేస్ ఉందని ఈ సినిమా ప్రూవ్ చేసింది. సినిమా రిలీజ్ రోజు రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఏడ్చాను. ఎందుకంటే ఈ సినిమా రిజల్ట్ తో నాతో పాటు మా టీమ్ అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. థియేటర్స్ విజిటి వెళ్లినప్పుడు ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం మర్చిపోలేను. నేను ఎవరినో వారికి తెలియదు. రాజు వెడ్స్ రాంబాయిలో రాజు గా నన్ను లవ్ చేస్తున్నారు. నా నెక్ట్స్ మూవీ కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని చేస్తా. అన్నారు

రైటర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ – అవకాశాల కోసం తిరిగే ఎంతోమంది ఆత్మాభిమానం కాపాడుతున్న సంస్థ ఈటీవీ విన్. వేణు ఊడుగుల మనసులోని భావాలు, ఆవేశానికి ప్రతిరూపం ఈ సినిమా. అఖిల్, తేజస్వినీని చూస్తుంటే మనం లైఫ్ లో చూసే జంటలా అనిపించారు. ఇలా సహజంగా నటించే యాక్టర్స్ ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉంటారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు హీరో తండ్రి ఇంకాసేపు బతికితే బాగుండు, హీరోయిన్ తండ్రి త్వరగా చస్తే బాగుండును అనిపించింది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ చేసిన రాంబాయి పాట, ఈ సినిమా ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఈ సినిమా విజయం ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశాలు వచ్చేలా స్ఫూర్తినిచ్చింది. అన్నారు.

రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా సక్సెస్ నన్ను ఈ ఈవెంట్ కు వచ్చేలా చేసింది. కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు, పవర్ స్టార్ అయ్యాడు. కానిస్టేబుల్ కొడుకు అఖిల్ కూడా ఆ స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. స్టార్స్ సినిమాలు ఆడితే బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి. కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు ఆదరణ పొందితే థియేటర్స్ బాగుంటాయి. ఎంతోమంది యంగ్ న్యూ టాలెంట్ బయటకు వస్తారు. మరాఠా ఇండస్ట్రీ సైరత్ లా తెలుగు చిత్ర పరిశ్రమకు “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా మిగిలిపోతుంది. అన్నారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – ఒక సినిమాతో ఇలా టీమ్ అంతా ఎమోషనల్ గా కనెక్ట్ కావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అరగంట కదా అని ఈ ఈవెంట్ కు వచ్చాను కానీ వీళ్లందరి చూస్తుంటే నేను వెళ్లాల్సిన ఫ్యామిలీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నా. వేణు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనను చూస్తుంటే నాకూ ప్రొడ్యూసర్ కావాలని ఉంది. డైరెక్టర్ సాయిలు అమీర్ పేట ఛాలెంజ్ చేసినప్పుడు ఒక సాటి డైరెక్టర్ గా భయమేసింది. కానీ ఈ రోజు సాయిలు బాక్సాఫీస్ బద్దలు కొట్టే సక్సెస్ ఇచ్చాడు. ఈ మూవీని సపోర్ట్ చేసిన ఈటీవీ విన్ వారికి, వంశీ నందిపాటి, బన్నీవాస్ గారికి కంగ్రాట్స్. సురేష్ బొబ్బిలి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. మిట్టపల్లి సురేందర్ నేను చిరంజీవి గారితో చేస్తున్న సినిమాకు పాటలు రాయాలి. అలాగే డైరెక్టర్ సాయిలు చిన్న క్యారెక్టర్ లో నటించాలి. కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్, పవర్ స్టార్స్ కావొచ్చు…టాలెంట్ ఎవరి సొత్తు కాదని అఖిల్ ప్రూవ్ చేశాడు. తేజస్వినీ చాలా హానెస్ట్ గా నటించింది. ఆమెను సావిత్రి గారితో పోలుస్తున్నారు. అఖిల్, తేజస్వినీ మరిన్ని మంచి మూవీస్ చేయాలి. చైతన్యకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా చూడండి అని చెప్పాల్సిన పని లేదు. ఈ వేదిక మీద కనిపిస్తున్న ఆనందమే విజయాన్ని చూపిస్తోంది. అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ – మనం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే విజయాన్ని దేవుడు తప్పకుండా అందిస్తాడు. ఈ టీమ్ కు కూడా అలాంటి సక్సెస్ అందించాడు. ఈ యంగ్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం నాకొక హ్యాపీ మూవ్ మెంట్. దేవుడు మనుషుల రూపంలోనే మనకు హెల్ప్ చేస్తుంటాడు. మా కెరీర్ బిగినింగ్ లో ఎవరు హెల్ప్ చేసినా దేవుడిగా భావించేవాళ్లం. ఇప్పుడు నెలకో కంటెంట్ ఉన్న చిన్న సినిమా రిలీజ్ కు తీసుకొస్తూ వంశీ నందిపాటి, బన్నీ వాస్ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రెడబిలిటీ వంశీ, బన్నీ వాస్ కు లైఫ్ లో చాలా హెల్ప్ అవుతుంది. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు పనిచేసిన టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరునా నా శుభాకాంక్షలు అందిస్తున్నా. యాక్టర్ చైతన్యతో కలిసి వర్క్ చేయాలని ఉంది. అతని మూవీస్ చూస్తుంటే ఒకరోజు మాకు కూడా దొరకకుండా వెళ్తాడని అనిపిస్తోంది. అఖిల్, తేజస్వినీ బాగా నటించారు. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. వేణు నేను కలిసి నీదీ నాదీ ఒకే కథ మూవీ చేశాం. మట్టిలో నుంచి పుట్టిన కథలు వేణు దగ్గర చాలా ఉన్నాయి. ఆయన డైరెక్షన్ చేసుకుంటూనే సాయిలు లాంటి చాలామంది కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేయించాలని కోరుకుంటున్నా. వేణు దగ్గర ఉన్న కథలు మన ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈటీవీ విన్ టీమ్ కు కంగ్రాంట్స్. ఆడియెన్స్ కు కావాల్సిన కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు కంటిన్యూగా సక్సెస్ వస్తోంది. అన్నారు.

నటీనటులు – అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్స్ – ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
సౌండ్ డిజైన్ – ప్రదీప్.జి.
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే
ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధన గోపి
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ – నరేష్ అడుపా
కో ప్రొడ్యూసర్స్ – ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
రచన, డైరెక్షన్ – సాయిలు కంపాటి
ప్రొడక్షన్ – ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
థియేట్రికల్ రిలీజ్ – వంశీ నందిపాటి(వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్)
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments