ప్రముఖ నటి సమంత ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. మే 9న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిఫరెంట్ కామెడీ, హారర్ జానర్లో ఈ చిత్రం అద్భుతంగా ఉందని సెన్సార్ బృందం ప్రశంసలు కురిపించింది. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ ముఖ్య పాత్రలను పోషించారు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం, క్లింటన్ సెరెజో పాటలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్లు వేసి ‘శుభం’ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్పెషల్ ప్రీమియర్ షోల నుంచి ‘శుభం’ చిత్రానికి విశేషమైన స్పందన లభించింది!!
