HomeEntertainmentహర్ర్ ఫాంటసీ కామెడీ కుటుంబ కథా చిత్రం రాకాస

హర్ర్ ఫాంటసీ కామెడీ కుటుంబ కథా చిత్రం రాకాస

- Advertisment -
  • ఏప్రిల్ 3 న విడుదల కుటుంబం తో కలిసి చూడాలి
  • రాజమండ్రి లో సందడి చేసిన రాకాస చిత్రం యూనిట్ సభ్యులు

రాజమహేంద్రవరం, మార్చి 22 :

నిహారిక కొణెదల ప్రొడక్షన్ లో హీరో సంగీత్ శోభన్ , హీరోయిన్ నయన సారిక కలిసి నటించిన రాకాస చిత్రం హర్ర్, ఫాంటసీ, కుటుంబ కథా చిత్రమని ప్రొడ్యూసర్ నిహారిక కొణతాల అన్నారు . ఆదివారం రాకాస మూవీ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా హీరో , హీరోయిన్, కొణెదల నిహారిక,గెటప్ శ్రీను చిత్ర బృందం రాజమండ్రి షెల్టాన్ హోటల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు . చిత్రం యూనిట్ సభ్యులతో కలిసి నిహారిక మాట్లాడుతూ కమిటీ కుర్రాళ్ళు కంటే భిన్నంగా రాకాస సినిమా కధ ఉంటుందని అన్నారు. హిరో సంగీత్ శోభన్ , హీరోయిన్ నయన సారిక లు ఈ సినిమాలో కష్టపడి నటించారని వివరించారు. ఏప్రిల్ 3 వ తేదీన విడుదల అవుతుందని తెలిపారు. సంగీతం, డాన్స్,లతో సినిమా ఉత్సాహంగా ఉంటుందని వివరించారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.

సినిమా ను కుటుంబంతో కలిసి చూడాలని కోరారు. సినిమా హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ రాజమండ్రి దేవీ చౌక్ లో అమ్మవారిని దర్శించుకున్నామని తెలిపారు. తన తండ్రి గారిది రాజమండ్రి సమీపంలోని కోరుకొండ గ్రామమని తెలిపారు. రాకాస ఫాంటసీ,ధ్రిల్లర్, కామెడీ సినిమా అన్నారు. నటీ నటులు అంతా కష్టపడి పని చేశామని అన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని పేర్కొన్నారు. హీరోయిన్ నయన సారిక మాట్లాడుతూ రాజమండ్రి చాలాసార్లు వచ్చానని చెప్పారు. ప్రెస్ మీట్ లో కూర్చుని మాట్లాడడం మొదటి సారని అన్నారు. రాకాస సినిమా లో కష్టపడి నటించామని తెలిపారు. ఇది తనకు మూడోవ ప్రాజెక్ట్ అని అన్నారు.ఫన్, ధిల్లర్ , సినిమా అని తప్పకుండా ఆదరించాలని పేర్కొన్నారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ రాజమండ్రి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఫాంటసీ,హర్ర్, కామెడీ ,కుటుంబం కధా చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments