Sunday, June 1, 2025

Top 5 This Week

Related Posts

పుష్ప ప్రకంపనలకు శ్రీకారం చుట్టిన పాట్నా

పుష్ప పార్ట్-1కి బ్రహ్మరథం పట్టిన బీహార్ పట్ల కృతజ్ఞతతో… బీహార్ రాజధాని పాట్నాలో “పుష్ప-2” ట్రైలర్ విడుదల చేశారు. అల్లు అర్జున్, రష్మిక సహా నిర్మాతలు పాల్గొన్న ఈ వేడుకలో బీహార్ ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పాట్నా సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ ట్రైలర్ వేడుక నిర్వహించారు. ఇకపోతే… “పుష్ప-2” ట్రైలర్… ఈ చిత్రంపై ఇప్పటికే గల అంచనాలను మరింత పెంచేసింది. ఈ ట్రైలర్ లో ఉన్న పంచ్’లు కొంతమందిలో ఏమూలనో ఉన్న అనుమానాలు పటాపంచలు చేసింది. పాట్నా ప్రజల అభిమానానికి ఉబ్బితబ్బిబ్బు అయిన అల్లు అర్జున్… “పుష్ప-2” ట్రైలర్ బీహారీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండడం తెలిసిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles