Friday, December 5, 2025
HomeEntertainmentమళ్ళీ "పెళ్లి చేసుకుందాం"అంటున్న విక్టరీ వెంకటేష్!!

మళ్ళీ “పెళ్లి చేసుకుందాం”అంటున్న విక్టరీ వెంకటేష్!!

- Advertisment -

విక్టరీ వెంకటేష్ జన్మదిన
కానుకగా డిసెంబర్ 13న
ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్
“పెళ్ళి చేసుకుందాం” రీ-రిలీజ్

సాయిలక్ష్మీ ఫిల్మ్స్ ద్వారా
“4 కె” లోరెండు తెలుగు రాష్ట్రాల్లో
బ్రహ్మాండమైన విడుదల!!

విక్టరీ వెంకటేష్ నటించగా అసాధారణ విజయం సాధించిన చిత్రాల్లో “పెళ్ళి చేసుకుందాం” ఒకటి. అందం – అభినయాల కలబోత సౌందర్య హీరోయిన్ గా సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని సి.వెంకట్రాజు – శివరాజు సంయుక్తంగా నిర్మించారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని సాయిలక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై వరప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కె లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు!!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో తెలుగులో 300 కోట్ల క్లబ్బు ఫౌండర్ హీరోగా చరిత్ర సృష్టించిన వెంకటేష్ బాబు నటించిన ఆణిముత్యాల్లో ఒకటైన “పెళ్ళి చేసుకుందాం” చిత్రాన్ని 4 కె రిజల్యూషన్ లో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఫ్రెష్ గా తీసుకువచ్చే అవకాశం లభించడం గర్వంగా ఉంది. మన రెండు రాష్ట్రాల్లో ఉన్న విక్టరీ ఫ్యాన్స్ తోపాటు… సిసలైన సినీ ప్రేమికులంతా “పెళ్ళి చేసుకుందాం” చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మూడేళ్లపాటు ఈ చిత్రం హక్కుల్ని మేము కలిగి ఉన్నాం” అని అన్నారు. లైలా బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, మ్యూజిక్: కోటి, నిర్మాతలు: సి.వెంకట్రాజు-శివరాజు, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య, రీ-రిలీజ్ : వరప్రసాద్ – సాయిలక్ష్మీ ఫిల్మ్స్!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments