Thursday, February 5, 2026
HomeEntertainment‘పెద్ది’ విడుదల వాయిదా?

‘పెద్ది’ విడుదల వాయిదా?

- Advertisment -

టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, ప్రస్తుతం డిసెంబర్ 2026కి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్ పని చేస్తున్నారు. సుకుమార్ కథా పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
విజువల్స్, సంగీతం మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరమని, ప్రేక్షకులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభవం అందించాలనే ఉద్దేశంతో విడుదలను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది.


రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో ఆయన పూర్తిగా కొత్త లుక్‌, శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు సానా భావోద్వేగాత్మక కథనానికి, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments