తెలుగు తెరపై “అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి”తో మొదలైన ఆయన ప్రయాణం, “గబ్బర్ సింగ్” ఊపు తీసుకున్న ఓ పవర్‌ఫుల్ జర్నీ. “తొలిప్రేమ”లో చూపించిన అమాయకమైన ప్రేమ, “తమ్ముడు” పంచిన ఒక ఎమోషన్, “ఖుషీ”లోని ఎనర్జీ, “జల్సా”లో కనిపించిన ఫుల్-ఫన్ మూడ్ – ఇవన్నీ ఒక్కో దశలో ఆయనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఆ తర్వాత మళ్లీ కొంచెం గ్యాప్ తీసుకుని వచ్చిన “అత్తారింటికి దారేది” బ్లాక్‌బస్టర్ అయితే, అప్పట్లో ఆయనకు వచ్చిన అడ్డంకులను చెదరగొట్టిన గర్జన లాంటిది.
“వకీల్ సాబ్”లో కనిపించిన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, “బ్రో”లో ఉన్న ఆత్మీయమైన పాత్ర, ఇప్పుడు వచ్చే ఊగాది పండుగకు రెడీ అవుతున్న OG, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్” ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న బిగ్ ట్రీట్స్. ప్రతి అప్‌డేట్‌కి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు అంటే ఆయన క్రేజ్ ఏమిటన్నది అర్థం అవుతుంది.
సినిమాలు ఒక వైపు, రాజకీయాలు మరో వైపు – రెండు రంగాల్లోనూ పోరాడుతున్న పవన్ కళ్యాణ్ అంటే కేవలం హీరో కాదు… ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక గర్జన!!!