HomeEntertainment‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల,...

‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026

- Advertisment -

సామాజిక బాధ్యతతో కొత్త ప్రయాణం

‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్‌ సాంగ్‌ ద్వారా సంగీత రంగంలోకి అడుగుపెడుతున్న సిద్ధు రెడ్డి కందకట్ల కార్యక్రమాలను కేవలం వినోదానికి పరిమితం చేయకుండా ఉద్యోగ అవకాశాలు, సామాజిక సహాయం, కమ్యూనిటీ అభివృద్ధికి ఉపయోగపడేలా కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

70కి పైగా ఐటీ, నాన్‌-ఐటీ సంస్థల భాగస్వామ్యం

1,000కిపైగా ఉద్యోగావకాశాలు.. భారీగా హాజరైన నిరుద్యోగులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 29: వినోదంతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తించే లక్ష్యంతో ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్‌ సాంగ్‌ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్, ఆధ్వర్యంలో హైటెక్‌ సిటీలో జాబ్‌ మేళా నిర్వహించారు. శిల్పారామం సమీపంలోని సైబర్‌ గార్డెన్స్‌, జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఉద్యోగార్థులు హాజరయ్యారు. సిద్దు రెడ్డి కందకట్ల, కాత్యాయని జగన తో పాటు నటి వైష్ణవి చైతన్య, నిలోఫర్‌ కేఫ్‌ అధినేత బాబూరావు తదితరులు కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపారు.

జాబ్‌ మేళాలో 70కిపైగా ఐటీ, నాన్‌-ఐటీ సంస్థలు పాల్గొని 1,000కిపైగా ఉద్యోగావకాశాలు కల్పించాయి. అభ్యర్థులకు ఆయా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి స్పాట్‌ ఆఫర్‌ లెటర్లు అందించే అవకాశం కల్పించారు.

వివిధ రంగాల్లో ఉద్యోగాలు

టీసీఎస్‌, సగాలిటీ, టెలిపర్ఫార్మెన్స్‌, హెచ్‌జీఎస్‌, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, డిజిటైడ్‌, జెన్‌పాక్ట్‌, జస్ట్‌డయల్‌, రిలయన్స్‌ డిజిటల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, నియాన్‌ మోటార్స్‌ తదితర సంస్థలు జాబ్‌ మేళాలో పాల్గొన్నాయి. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, లాజిస్టిక్స్‌, ఆటోమొబైల్స్‌, ఫార్మసీ, నర్సింగ్‌, మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, హాస్పిటాలిటీ, సేల్స్‌, డ్రైవింగ్‌, ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌, వాయిస్‌, నాన్‌-వాయిస్‌ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంచారు.

10వ తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీకాం, ఎంబీఏతో పాటు ఇతర డిగ్రీలు చదివిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులు కూడా మేళాలో పాల్గొన్నారు.

300 మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా

300 మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా 3 లక్షలు అది వివిధ సందర్భాల్లో ఉపయోగించుకునేటట్లు, సహాయం అందించినట్లు, అనుకోని సంఘటనలో జరిగితే 10 లక్షల 50 వేల రూపాయలు ఆర్థిక సాయం గా ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు జాబ్‌ మేళా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

సాంకేతిక సిబ్బందికి బీమా

‘ఓ నా సిద్ధయ్య’ పాట రూపకల్పనలో పనిచేసిన డైరెక్షన్‌, కెమెరా, ఇతర సాంకేతిక విభాగాల సభ్యులకు బీమా సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రాజెక్టు వెనుక పనిచేసిన సాంకేతిక నిపుణులకు అండగా నిలవడమే దీని ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

‘ఓ నా సిద్ధయ్య’కు కళ్యాణ్‌ కీస్‌ సంగీతం అందించగా.. రామ్‌ అద్నాన్‌ సాహిత్యం, దర్శకత్వం వహించారు. రామ్‌ అద్నాన్‌, శ్రీనిధి గానం చేశారు. అరుణ్‌ కొలుగూరి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments