ఒకప్పుడు వరుస విజయాలతో దూకుడు ప్రదర్శించిన శ్రీను వైట్లను ఇప్పుడు వరుస పరాజయాలు పలకరిస్తుండడం తెలిసిందే. గోపిచంద్ తో తీసిన “విశ్వం” శ్రీను వైట్లకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని భావించినా… కాస్తంత లో మిస్ ఫైర్ అయ్యింది. హీరో నితిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రానున్నదని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు మైత్రి సంస్థ ముందుకు రావడం ఇక్కడ మరో ముఖ్య విశేషం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి!!
