Friday, December 5, 2025
HomeEntertainment‘ద్రౌప‌ది 2’ నుంచి ‘నెల‌రాజె..’ అనే మెలోడీ సాంగ్‌ రిలీజ్‌

‘ద్రౌప‌ది 2’ నుంచి ‘నెల‌రాజె..’ అనే మెలోడీ సాంగ్‌ రిలీజ్‌

- Advertisment -

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ద్రౌప‌ది పాత్ర‌లోని ర‌క్ష‌ణ చంద్ర‌చూడ‌న్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రీసెంట్‌గానే విడుద‌ల చేయ‌గా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెల‌రాజె..’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

“Nelaraaje” Lyrical Video Telugu Song from Movie “Draupathi 2” – ▶ https://youtu.be/fD710WuFP3U

అమ్మాయి కాబోయే వరుడి మ‌న‌సులో ఊహించుకుంటూ పాడే పాట అది. జిబ్రాన్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలోని ఈ సాంగ్‌ను సామ్రాట్ రాయ‌గా ప‌ద్మ‌ల‌త పాడారు. ఈ మెలోడీ ట్యూన్‌, లిరిక్స్ అన్నీ హృదయానికి హ‌త్తుకునేలా ఉన్నాయి. యాక్ష‌న్ సంతోష్ స్టంట్స్ కంపోజ్ చేస్తోన్న ఈ సినిమాకు పిలిప్ ఆర్‌.సుంద‌ర్ కెమెరామెన్‌గా, దేవరాజ్ ఎస్ ఎడిటర్‌గా, ఎస్ కే ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

నటీనటులు : రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్, నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, వై గీ మహేంద్రన్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్
నిర్మాత : సోల చక్రవర్తి
దర్శకుడు : మోహన్. జి
సంగీత దర్శకుడు : జిబ్రాన్
కెమెరామెన్ : ఫిలిప్ ఆర్ సుందర్
ఎడిటర్ : దేవరాజ్ ఎస్
ఆర్ట్ డైరెక్టర్‌ : ఎస్ కే
స్టంట్స్ : యాక్షన్ సంతోష్
డైలాగ్స్ : సామ్రాట్
పి.ఆర్.ఒ : సురేంద్ర నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments