తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌పై అధికారిక అప్‌డేట్ రానుంది. హీరో నాగచైతన్య తన 24వ సినిమాగా ‘విరూపాక్ష’ కార్తీక్ దర్శకత్వంలో ఓ మ్యాసివ్ యాక్షన్ డ్రామాను చేయబోతున్నట్టు తెలుస్తోంది.

➤ 120 కోట్ల భారీ బడ్జెట్
ఈ చిత్రాన్ని సుమారు ₹120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లో ఇదే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. విజువల్ స్టాండర్డ్స్, యాక్షన్ డిజైన్, టెక్నికల్ స్కేల్ ఈ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లబోతున్నాయని సమాచారం.

‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వరమ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తన సిగ్నేచర్ స్టైల్‌లో ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎమోషన్‌లతో కూడిన యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారని, ఈ చిత్రాన్ని నాగచైతన్య కెరీర్‌లో స్పెషల్ ప్రాజెక్ట్ కానుందని సమాచారం!!

