తెలుగు చిత్ర పరిశ్రమలో తరచూ విడుదల తేదీలు మారుతున్న తీరుపై కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిల్ నటించిన “లెనిన్” విజయోత్సవ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. “గతంలో సినిమా విడుదలకు దాదాపు నెల రోజుల ముందే ఫైనల్ కాపీ సిద్ధంగా ఉండేదని, అందువల్ల సాంకేతిక నిపుణులు కూడా ప్రశాంతంగా పని చేసి” నాణ్యమైన ఫలితాన్ని అందించేవారని” ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం విడుదల తేదీ దగ్గరపడినా పనులు కొనసాగుతుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు అనవసర ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ప్రపంచ సినీ పరిశ్రమలో ముందుగానే విడుదల తేదీలను ప్రకటించి, వాటికి కట్టుబడి సినిమాలను విడుదల చేస్తున్నారని ఉదాహరణగా ప్రస్తావించిన నాగార్జున, టాలీవుడ్ కూడా అదే క్రమశిక్షణను అలవర్చుకోవాలని కోరారు. ఇటీవలికాలంలో పలు పెద్ద సినిమాలు ప్రకటించిన తేదీల నుంచి వాయిదా పడిన నేపథ్యంలో నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో ఆరోగ్యకరమైన చర్చకు దారితీశాయి!!

