HomeEntertainmentఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో అత్యధికంగా 1013 ఓట్లతో రెండవసారి సెక్రటరీగా ఎన్నికైన ముళ్లపూడి మోహన్

ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో అత్యధికంగా 1013 ఓట్లతో రెండవసారి సెక్రటరీగా ఎన్నికైన ముళ్లపూడి మోహన్

- Advertisment -

ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల ఫలితాలు వెల్లువయ్యాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు విజయం సాధించారు. సెక్రటరీగా ముళ్లపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్‌గా సదాశివరెడ్డి, ట్రెజరర్‌గా శైలజ, జాయింట్ సెక్రటరీగా ఎస్.ఎన్. రెడ్డి ఎన్నికయ్యారు. కమిటీ మెంబర్లుగా ఏడిద రాజా, కృష్ణంరాజు, శ్రీనివాసరాజు, కిషోర్, కాజా సూర్యనారాయణ, మురళీమోహన్ రావు, బాస్కర్ నాయుడు, బాలరాజు, నాగసుష్మ విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో ముళ్లపూడి మోహన్ గారికి అత్యధికంగా 1,013 ఓట్లు లభించాయి. గతంలో ఆయన తెలంగాణ టీటీడీ ఎల్ఏసి సభ్యునిగా ఎంపికయ్యారు. FNCC వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఆయనకు అనుభవం ఉంది. ఆ సమయంలో మోహన్ గారు స్పోర్ట్స్, కల్చరల్ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించడంతో సౌత్ ఇండియాలో FNCC ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఉంపయోగపడింది. ఇప్పుడు మరోసారి ఆయన సెక్రటరీగా ఎన్నిక కావడం దక్షిణ భారత దేశంలోనే కాకుండా యావత్ భారత దేశంలో FNCC ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఆయన అనుభవం తోడ్పడుతుంది. మరోవైపు, కె.ఎస్. రామారావు ప్యానెల్ నుంచి ఆయన ఒక్కరే విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ఎన్నికల ఫలితాలతో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడింది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments