దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన “తీయవర్ కులై నడుంగ” తమిళ చిత్రం ఈరోజు తెలుగులో “మఫ్టీ పోలీస్” పేరుతో విడుదలైంది. ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ… శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే?
*నటీనటులు* :
అర్జున్ సర్జ- ఐశ్వర్య రాజేష్, రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, ఎడిటింగ్: లారెన్స్ కిషోర్, సినిమాటోగ్రఫీ: భరత్ ఆశీనగన్, మ్యూజిక్: శరవణన్ అభిమన్యు, నిర్మాత: జి.అరుల్ కుమార్, రచన – దర్శకత్వం: దినేష్ లక్ష్మణన్, విడుదల; శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ – ఎ. ఎన్. బాలాజీ.
*కథ*:
ఒక ప్రముఖ రచయితను ముసుగు వేసుకున్న వ్యక్తి భయంకరంగా హత్య చేస్తాడు. కేసు విచారణ బాధ్యతను పోలీసు అధికారి అర్జున్ తీసుకుంటాడు. అతను లోతుగా పరిశోధించడం మొదలుపెట్టినప్పుడు, ఈ హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో, ఆటిజం ఉన్న పిల్లల కోసం పనిచేసే టీచర్ ఐశ్వర్య రాజేష్, మ్యారేజ్ పోర్టల్‌లో పరిచయమైన ప్రవీణ్ రాజాతో సన్నిహితంగా మెలుగుతుంది. కానీ తర్వాత అర్జున్‌కి రచయిత హత్య, ప్రవీణ్ రాజా ఉండే అపార్ట్‌మెంట్‌లో జరిగిన గత సంఘటన, ఐశ్వర్య రాజేష్ పాత్ర ఈ మూడింటి మధ్య ఒక భయంకరమైన లింక్ ఉందని తెలుస్తుంది.
అర్జున్ విచారణ సమయంలో మరొక హత్య కూడా జరుగుతుంది. ఇందులో ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? అసలు ఆ సీక్రెట్ కిల్లర్ ఎవరు? అన్నది చివరివరకు ఉత్కంఠగా నడుస్తుంది.
*ఎవరెవరు ఎలా చేశారు?* -పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ చాలా గంభీరంగా నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ పాత్రకు బాగా సరిపోయాయి. యాక్షన్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. ఐశ్వర్య రాజేష్ సస్పెన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. సహజ నటన చాలా బాగుంది. బేబీ అనికా ఆటిజం ఉన్న చిన్నారి పాత్రలో చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా నటించింది. ప్రవీణ్ రాజా & ఇతరులు తమ తమ పాత్రలకు తగిన విధంగా నటించారు. సపోర్టింగ్ క్యాస్ట్ మొత్తం సినిమాకు బలం ఇచ్చింది.
*మ్యూజిక్*– భరత్ ఆసీనగన్ సంగీతం పాటల కన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా హత్య సీన్లు, విచారణ సన్నివేశాల్లో BGM బాగా ఎఫెక్ట్ ఇస్తుంది.
*సినిమాటోగ్రఫీ* – శరవణన్ అభిమన్యు డార్క్ & ఇంటెన్స్ టోన్ నేరేటివ్‌కి మంచిగా పనిచేసింది.
*ఎడిటింగ్* – లారెన్స్ కిషోర్
పేస్ కొంచెం స్లో అయినా, థ్రిల్లర్‌కు కావాల్సిన ఉత్కంఠను బాగా నిలబెట్టాడు.
*డైరెక్షన్* – దినేష్ లక్ష్మణన్ క్రైమ్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. స్క్రీన్‌ప్లేలో సస్పెన్స్‌ను చివరి వరకూ నిలబెట్టడంలో విజయం సాధించారని చెప్పాలి.
*ప్లస్*:
ప్లస్ -సస్పెన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్, క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఆకట్టుకున్నాయి.
*మైనస్*:
మైనస్‌లు-కొన్నిచోట్ల పేస్ స్లో, స్క్రీన్‌ప్లే కొంచెం హేవీగా అనిపించొచ్చు, హార్డ్‌కోర్ థ్రిల్లర్ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు
*చివరగా*:
మొత్తానికి సస్పెన్స్‌తో, భావోద్వేగంతో, రియలిస్టిక్ యాంగిల్‌తో చెప్పిన క్రైమ్ థ్రిల్లర్. ఈ జానర్ ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. యాక్షన్ కింగ్ అర్జున్ అభిమానుల కోసం నిర్మాత ఎ. ఎన్. బాలాజీ దీన్ని తెలుగువారి ముందుకు తీసుకురావడం అభినందనీయం.
Rating: 3/5
మఫ్టీ పోలీస్ మూవీ రివ్యూ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
