HomeEntertainmentకేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలని కోరిన మెగాస్టార్...

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలని కోరిన మెగాస్టార్ చిరంజీవి

- Advertisment -

కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను రూపొందించడంపై ఇటీవల ఎక్స్‌ వేదికగా తన ఆందోళనను వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ అంశంపై మరో కీలక అడుగు వేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి, ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ సమస్యలను వివరించారు. ఈ భేటీలో చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తున్న తీరును స్వయంగా వివరించేందుకు చిరంజీవి ఈ భేటీకి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ సాంకేతికతల దుర్వినియోగం కళాకారుల హక్కులు, గౌరవం, క్రియేటివ్ కంటెంట్‌కు ముప్పుగా మారుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యను కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితం చేయకుండా, చిత్ర పరిశ్రమ తరఫున ఇటువంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోరారు.

చిరంజీవి ఆందోళనలను సానుకూలంగా అర్థం చేసుకున్న కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు.. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలిస్తుందని, మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేసే దిశగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంపై లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని సూచించిన ఆయన, ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి అప్పగించారు.

కేంద్ర హోంమంత్రి స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి.. ఆయన ఇచ్చిన హామీ చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహాన్నిచ్చే కీలక అడుగుగా అభివర్ణించారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించి, కళాకారులకు తగిన రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments